Suicide Pod : టెక్నాలజీ అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దీన్ని మనం జాగ్రత్తగా వాడాలి. టెక్నాలజీని వికాసం కోసం వాడాలే తప్ప వినాశనం కోసం వాడకూడదు. మానవ హక్కుల గురించి గొంతు చించుకొని అరిచే స్విట్జర్లాండ్‌కు చెందిన ది లాస్ట్ రిసార్ట్ అనే సంస్థ ‘సూసైడ్ పాడ్’ను ఈ ఏడాది జులై నెలలో తయారు చేసింది. దానికి సార్కో ఫాగస్ అనే పేరు పెట్టింది. ఇదొక పోర్టబుల్ 3డీ ప్రింటెడ్ ఛాంబర్. గత సోమవారం రోజు స్విట్జర్లాండ్‌లో ఓ అమెరికన్ మహిళ (64 ఏళ్లు) ‘సూసైడ్ పాడ్’ను ఉపయోగించి సూసైడ్ (Suicide Pod) చేసుకుంది. స్విస్ – జర్మన్ సరిహద్దుకు సమీపంలోని మెరిచౌసెన్ అటవీప్రాంతంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. సూసైడ్ పాడ్‌ను అందించి అటవీప్రాంతంలో ఆమె సూసైడ్‌కు సహకరించారనే అనుమానంతో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో సూసైడ్ పాడ్ పరికరం పనితీరు వివాదాస్పదంగా మారింది. దీని వినియోగంపై ప్రశ్నలు తలెత్తాయి.
Also Read :Deendayal Upadhyaya : ఇవాళ అంత్యోదయ దివస్.. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జీవితంలోని కీలక ఘట్టాలివి
సార్కో ఫాగస్ అనే పేరు కలిగిన ఈ సూసైడ్ పాడ్ లోపలికి వెళ్లి కూర్చొని బటన్‌ను నొక్కిన వెంటనే మరణం సంభవిస్తుంది. స్విట్జర్లాండ్‌లో సహాయక మరణం అనేది దశాబ్దాలుగా చట్టబద్ధమైన చర్య. అయితే అది కూడా ప్రభుత్వ వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా జరగాలి. ఆ దేశ నిబంధనలను ఉల్లంఘించే రీతిలో సదరు అమెరికా మహిళ సూసైడ్ జరిగింది. సూసైడ్ పాడ్ వినియోగం చట్టవ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే ఇందులో కూర్చున్న తర్వాత ఎటువంటి వైద్య పర్యవేక్షణ లేకుండానే తమ జీవితాలను ముగించుకునేందుకు వీలు ఉంటుంది.
Also Read :Pakistan : దేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్తాన్ అని పిలవొద్దు : సుప్రీంకోర్టు
సూసైడ్ పాడ్ ఎలా పనిచేస్తుంది ?
సూసైడ్ పాడ్‌లోకి వెళ్లి సీటులో కూర్చొని లోపల ఉన్న బటన్‌ను నొక్కగానే అది మూసుకుపోతుంది. వెంటనే సూసైడ్ పాడ్ లోపల నైట్రోజన్ గ్యాస్ పెద్దమొత్తంలో రిలీజ్ అవుతుంది. దీంతో అందులో కూర్చున్న వ్యక్తి శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోతాయి. దీంతో మరణం సంభవిస్తుంది.