EVM Malfunction : ఈవీఎంలో తప్పుడు బటన్‌ నొక్కితే.. ? అకస్మాత్తుగా ఈవీఎం మొరాయిస్తే.. ఎలా ?

EVM Malfunction :  ఓట్ల పండుగ మరెంతో దూరంలో లేదు. శుక్రవారం (ఏప్రిల్ 19న) జరగనున్న తొలివిడత పోలింగ్‌కు  ఏర్పాట్లు పూర్తయ్యాయి.

  • Written By:
  • Publish Date - April 18, 2024 / 09:58 AM IST

EVM Malfunction :  ఓట్ల పండుగ మరెంతో దూరంలో లేదు. శుక్రవారం (ఏప్రిల్ 19న) జరగనున్న తొలివిడత పోలింగ్‌కు  ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 7 విడతలుగా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని ఓటర్లంతా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) లో తమ ఓటును నిక్షిప్తం చేస్తారు. ఓటు వేసేటప్పుడు పొరపాటున మన ఏదైనా తప్పుడు బటన్‌ను నొక్కితే ..ఎలా ? మళ్లీ రెండోసారి ఓటు వేయొచ్చా ? పోలింగ్ జరుగుతుండగా ఏదైనా ఈవీఎం పనిచేయకుండా మొరాయిస్తే ఏమవుతుంది ? అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఈ అంశాలపై ఓ లుక్ వేద్దాం..

We’re now on WhatsApp. Click to Join

ఈవీఎంలో ఎన్ని భాగాలు ఉంటాయో తెలుసా ?

ఈవీఎంలో బ్యాలెట్ యూనిట్ (బీయూ), కంట్రోల్ యూనిట్ (సీయూ) అనే రెండు భాగాలు ఉంటాయి. మనం ఓటువేసే దాన్ని బ్యాలెట్ యూనిట్ అంటారు. కంట్రోల్ యూనిట్ (సీయూ) పోలింగ్ అధికారి దగ్గర ఉంటుంది. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్‌లు ఐదు మీటర్ల కేబుల్‌తో కనెక్టయి ఉంటాయి. పోలింగ్ కేంద్రంలో ‘ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్’ (వీవీ ప్యాట్) యంత్రం కూడా ఉంటుంది. మనం ఓటు వేయగానే.. వీవీ ప్యాట్‌లో నుంచి ఒక స్లిప్ బయటికి వచ్చి అక్కడే ఉన్న బాక్సులో పడిపోతుంది.

Also Read :Nestle – Cerelac : పిల్లలకు సెరెలాక్ ఇస్తున్నారా ? అందులో చక్కెర మోతాదుపై సంచలన రిపోర్ట్

పొరపాటున మరో బటన్ నొక్కారో.. 

  • ఈవీఎంలో(EVM Malfunction)మనం ఓటు వేయగానే రెడ్ కలర్ సిగ్నల్ వస్తుంది.. ఆ వెంటనే బీప్ సౌండ్ వినిపిస్తుంది.  వీవీ ప్యాట్‌ నుంచి ఒక స్లిప్ రిలీజవుతుంది. ఇవన్నీ  మన ఓటు నమోదైంది అనేందుకు సాక్ష్యాలు.
  • ఒకవేళ ఈవీఎంలో మనం పొరపాటున వేరే బటన్ నొక్కితే.. మరోసారి ఓటు వేసే అవకాశాన్ని పొందడం అంత ఈజీ కాదు.
  • అక్కడున్న పోలింగ్ అధికారి అనుమతి తీసుకున్నాకే ఆ ఛాన్స్ లభిస్తుంది.
  •  ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు  అక్కడున్న పోలింగ్ అధికారికి సమాచారం ఇవ్వాలి.  వెంటనే ఆయన వచ్చి ఈవీఎంలో ఉండే ఒక బటన్‌ను నొక్కి.. మీకు మరోసారి ఫ్రెష్‌గా ఓటువేసే ఛాన్స్‌ను కల్పిస్తారు.
  • మరోసారి ఓటువేసే అవకాశాన్ని మీకు కల్పించడానికి ముందు..  తొలుత  మీరు వేసిన ఓటు నమోదు కాలేదని సదరు అధికారి ధ్రువీకరించుకుంటారు.
  • ఇలా ఛాన్స్ పొందే ఓటరు నుంచి ఓ లెటర్‌ను పోలింగ్ అధికారి రాయించుకుంటారు. పొరపాటున తప్పుడు బటన్‌ను నొక్కానని అందులో రాసి ఇవ్వాల్సి ఉంటుంది.

ఈవీఎం మొరాయిస్తే..  నెక్ట్స్  ఏంటి ?

  • పోలింగ్ కొనసాగుతుండగా ఈవీఎం మొరాయిస్తే.. ఎలా? అంటే..  వాస్తవానికి గాబరా పడాల్సిన పని లేదు. ఈవీఎం మొరాయించినంత మాత్రాన అప్పటివరకు నమోదైన ఓట్ల సమాచారం ఎటూ పోదు. ఆ వివరాలన్నీ కంట్రోల్ యూనిట్‌లోని మెమొరీలో నిక్షిప్తమై ఉంటాయి. అవి కూడా ఒకవేళ గల్లంతైనా వీవీ ప్యాట్ స్లిప్పులు రెడీగా ఉంటాయి.
  • కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్‌లలో ఏ ఒక్కటి మరమ్మతుకు గురైనా, మొరాయించినా.. మొత్తం కొత్త సెటప్‌ను అప్పటికప్పుడు అక్కడికి పంపుతారు. ఈ కొత్త సెటప్‌లో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు తలెత్తిన పోలింగ్ కేంద్రానికి సంబంధించిన పాత ఈవీఎంను కూడా కౌంటింగ్‌కు పంపుతారు. ఎందుకంటే అంతకుముందు వరకు నమోదైన ఓట్లు అందులోనే ఉంటాయి.
  •  ఒకవేళ పోలింగ్ కేంద్రంలో వీవీ ప్యాట్ యంత్రం మొరాయిస్తే.. దాని ప్లేసులో మరో వీవీ ప్యాట్‌ను అక్కడ ఏర్పాటు చేయిస్తారు.
  • ఇటువంటి పరిస్థితుల్లో వాడుకునేందుకు ప్రతీ జిల్లా కేంద్రంలోనూ అదనంగా కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్లను రిజర్వులో ఉంచుతారు.

Also Read :ED – 10 Years : మోడీ హయాంలో ఈడీ దూకుడు.. పదేళ్ల లెక్కలివీ..