Youth Suicide : పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం తల్లిదండ్రులు వారితో గడపకపోవడమేనా..?

ప్రస్తుతం తల్లిదండ్రులు లో చాలామంది సంపాదనే ఆలోచిస్తున్నారు తప్ప..పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేద్దామా..అని ఆలోచించడం లేదు. ప్రతిరోజు లేచామా..టిఫిన్ చేశామా..బాక్స్ తీసుకోని ఆఫీస్ కు పోయామా

  • Written By:
  • Publish Date - September 22, 2023 / 12:30 PM IST

ఇటీవల కాలంలో అతి చిన్న వయసులోనే కొంతమంది పిల్లలు ఆత్మహత్య (Youth Suicide) చేసుకొని తల్లిదండ్రులకు (Parents ) కడుపుకోత మిగులుస్తున్నారు. రోజు రోజుకు టెక్నాలజీ బాగా పెరుగుతుంది… సమాజం మారుతుంది.. పిల్లల మనస్తత్వం మారుతుంది. కనీసం ఆలోచించే శక్తిని కూడా కోల్పోతున్నారు. చిన్న చిన్న వాటికే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నాన్న కొట్టాడనో, అమ్మ తిట్టిందనో, అన్న మందలించాడనో, ఫోన్ కొనివ్వలేదని, బైక్ పెట్రోల్ కి డబ్బులు ఇవ్వలేదని, స్నేహితుడు తిట్టాడనో ఇలా అనవసరమైన చిన్న చిన్న సమస్యలకే కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

మరికొంతమంది మాత్రం ఒత్తిడి (Stress) కి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మానసిక ఆందోళన, చదువు, ఆటలు, పాటలు, డ్యాన్స్ ఇలా రకరకాల పేర్లతో స్కూల్స్ , కాలేజీ లలో పిల్లలను ఒత్తిడికి గురి చేస్తున్నారు. అందులో కొంతమంది పిల్లలు ఒత్తిడిని తీసుకోవడం లేదు. చిన్న వయస్సులో.. ఇక జీవితం చాలు అనుకుంటున్నారు. ఓ బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా బిచ్చగాడు ఫేమ్ విజయ్ కూతురు కూడా అలాగే ఆత్మహత్య చేసుకుంది. మరి పసిమొగ్గల ఆకాల మరణానికి కారకులెవరు..? ఇందులో తల్లిదండ్రుల తప్పేంత..? ఆత్మహత్య చేసుకోగానే రకరకాలుగా నిందించే సమాజానికి బాధ్యత లేదా..? అనే ప్రశ్నలు ఇప్పుడు యావత్ ప్రజానీకాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి..

Read Also : AP : చంద్రబాబు స్కిల్ కేసులో ఊహించని ట్విస్ట్

ప్రస్తుతం తల్లిదండ్రులు (Parents Busy Life) లో చాలామంది సంపాదనే ఆలోచిస్తున్నారు తప్ప..పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేద్దామా..అని ఆలోచించడం లేదు. ప్రతిరోజు లేచామా..టిఫిన్ చేశామా..బాక్స్ తీసుకోని ఆఫీస్ కు పోయామా..రాత్రి 10 కాగానే ఇంటికి వచ్చామా..తిన్నామా..పడుకున్నామా..అంతే. రోజంతా పిల్లలు ఏంచేశారు..? స్కూల్ , కాలేజ్ లో ఏంచేశారు..? టీచర్లు ఏంచెప్పారు..? స్కూల్ or కాలేజ్ ఎలా ఉంది..? ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా..? మీకు ఎలా అనిపిస్తుంది..? ఇలా ఏ తల్లిదండ్రి కూడా పిల్లలు అడగడం లేదు. పిల్లలకు ఎన్ని ఇబ్బందులు ఉన్న వారికీ వారే లోలోపల అనుభవిస్తున్నారు..కొన్ని విషయాలు మాత్రం ఫ్రెండ్స్ కు చెప్పుకుంటున్నారు. తల్లిదండ్రులకు చెప్పుకోవాల్సిన విషయాలను మాత్రం వారి మనసులోనే దాచుకుంటున్నారు. ఆలా దాచుకుంటూ..దాచుకుంటూ ఒత్తడికి గురై చివరకు ప్రాణాలు వీడుస్తున్నారు.

తల్లిదండ్రులు (Parents) చేయాల్సిన పని :

పిల్లలకు మంచి స్కూల్‌లో జాయిన్ చేపించామా.. మంచి డ్రెస్సులు కొనిచ్చామా.. పుస్తకాలు, ఆట బొమ్మలు, చివరికీ డబ్బులు ఇచ్చామా అంటే సరిపోదు. వారితో ప్రతిరోజు గంట సేపైనా సమయం కేటాయించాలి. అప్పుడు మీ పిల్లల గురించి మీకు తెలుస్తోంది. మానసిక పరిస్థితి ఎలా ఉంది. ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతుంది. వారు ఏదైనా అంటే భయపడుతున్నారా..? అనే విషయం తెలుస్తోంది.

పిల్లల సంతోషాలు ఏంటీ..? ఏమిస్తే వారు హ్యాపీగా ఉంటారో తెలుస్తోంది. పిల్లలు ఆనందంగా ఉంటే ఏ సమస్య ఉండదు. వారి కోసం సమయం కేటాయిస్తే.. ఇష్టఇష్టాలు.. అభిరుచులు తెలుస్తాయి. దాంతో నెక్ట్స్ వారికి ఇష్టమైన వస్తువులు, ఫుడ్ ఇస్తే ఎగిరి గంతేస్తారు. ఇలా చేస్తే.. వారిలో ఆత్మన్యూనత భావం ఏర్పడదని.. ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందడుగు వేస్తారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే అర్ధాంతరంగా జీవితాన్ని చాలిస్తారని హెచ్చరిస్తున్నారు. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటే.. అలాంటి వాతావరణం ఉంటే.. తమ వెంట తల్లిదండ్రులు ఉన్నారనే ధైర్యం ఉంటుంది. లేదంటే ఒంటరి అనే భావనలో ఉంటారని చెపుతున్నారు.