CIBIL Report : మీ ‘సిబిల్‌’ రిపోర్టులో తప్పులున్నాయా ? ఇలా చేయండి

CIBIL Report : ‘సిబిల్’ అంటే క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఇండియా లిమిటెడ్‌.

Published By: HashtagU Telugu Desk
Cibil Report

Cibil Report

CIBIL Report : ‘సిబిల్’ అంటే క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఇండియా లిమిటెడ్‌. మన ఆర్థిక క్రమశిక్షణకు ఒక కొలమానం ‘సిబిల్‌’ రిపోర్టు. బ్యాంకులు లోన్స్ ఇచ్చేటప్పుడు సిబిల్ స్కోరునే పరిగణనలోకి తీసుకుంటాయి. సిబిల్ రిపోర్టులో ఒక్కోసారి కొన్ని తప్పులు దొర్లుతుంటాయి. అలాంటి వాటిని గుర్తించి మనం సరిచేయించుకోవాలి. లేదంటే మన లోన్ అప్లికేషన్లు రెజెక్ట్ అవుతాయి. సిబిల్‌ రిపోర్టులో(CIBIL Report) దొర్లే తప్పుల గురించి మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

  • సిబిల్ రిపోర్టులో మనం తీసుకున్న లోన్ల సమాచారం ఉంటుంది.
  • ఒక్కోసారి మనం కట్టాల్సిన లోన్ల సంఖ్యను, బకాయి ఉన్న లోన్ల మొత్తం అమౌంటును ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది. అలా చూపిస్తే ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చని మనం అనుమానించాలి.
  • లోన్ ఈఎంఐలను మనం లేటుగా పే చేసినా సిబిల్ రిపోర్టులో దాని ప్రస్తావన ఉంటుంది.
  • ఒకవేళ మనం సమయానికి కట్టినా.. లేటుగా చెల్లించినట్టు సిబిల్ రిపోర్టులో పొందుపరిస్తే అలర్ట్ కావాలి.
  • లోన్ల సమాచారంలో హెచ్చుతగ్గులపై నేరుగా మీ బ్యాంకు బ్రాంచీలో ఆరా తీయొచ్చు.
  • తీసుకోని లోన్లు కూడా మీ పేరిట చూపిస్తే వెంటనే సిబిల్‌‌కు కంప్లయింట్ పెట్టాలి.
  • సిబిల్ రిపోర్టులో కొన్నిసార్లు మన పేరు, చిరునామా, పుట్టిన రోజు, పాన్‌ కార్డు నంబర్ వంటి వివరాలు కూడా తప్పుగా వస్తుంటాయి.

Also Read :Congress Candidates : 114 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

  • సిబిల్‌ రిపోర్టులో ప్రతి ఖాతాదారుడికీ ఒక ప్రత్యేక నంబర్ ఉంటుంది.
  • సిబిల్‌ అధికారిక వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో మీ వివరాలతో లాగిన్‌ కావడం ద్వారా సిబిల్ రిపోర్టులో దొర్లే పొరపాట్లను మనం సరి చేయించుకోవచ్చు.
  • మన పొరపాట్లను నమోదు చేసేటప్పుడు తప్పకుండా సిబిల్ అకౌంట్ నంబరును పొందుపర్చాల్సి ఉంటుంది.
  • మీ నుంచి వెళ్లే కంప్లయింట్‌కు సంబంధించిన సమాచారాన్ని క్రెడిట్‌ బ్యూరో సంబంధిత బ్యాంకులకు పంపించి ధ్రువీకరించుకుంటుంది. ఆ తర్వాతే సిబిల్ రిపోర్టులో మార్పులు, చేర్పులు చేస్తుంది.
  • ఈ పొరపాట్లను సరిచేసేందుకు దాదాపు 30 నుంచి 45 రోజుల టైం పడుతుంది.

Also Read :BMW Group- Tata Technologies: టాటాలతో చెయ్యి కలిపిన బీఎండబ్ల్యూ.. ఎందుకో తెలుసా ?

  Last Updated: 02 Apr 2024, 03:37 PM IST