Site icon HashtagU Telugu

Assam School : పాత ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే ఆ స్కూల్ అడ్మిషన్ కన్ఫర్మ్..!

Waste Plastic Is Fee For Students Assam School Great Intiation

Waste Plastic Is Fee For Students Assam School Great Intiation

Assam School Great Initiation : ప్రస్తుత కాలంలో విద్య అనేది ఎంత పెద్ద కమర్షియల్ బిజినెస్ అయ్యిందో తెలిసిందే. చదుకోవడం అనేది చదువు కొనడం అనేలా మారింది. లక్షలకు లక్షలు డొనేషన్స్ తీసుకుంటూ విద్యని ఫస్ట్ క్లాస్ బిజినెస్ గా చేస్తున్నారు. అయితే అంత ఫీజులు కట్టలేని సాధారణ ప్రజలు తమ పిల్లల చదువు కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది.

అయితే అస్సాం (Assam) లో మాత్రం ఓ స్కూల్ వెరైటీగా పాత ప్లాస్టిక్ బాటిల్ ఇస్తే చాలు చదువు ఉచితంగా చెబుతున్నారట. అస్సాం (Assam) లోని గౌహతిలో ఈ స్కూల్ ఉంది. పరిమిత, మాజిన్ దంపతులు ఈ స్కూల్ ను స్థాపించారు. స్థానిక పరిస్థితులు చూసిన వారు అక్కడ మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఉన్న చెత్తని క్లీన్ చేసేందుకు ఒక ఉపాయాన్ని ఆలోచించారు.

నిరక్షరాస్యత కూడా ఎక్కువగా ఉన్న ఆ ఏరియాలో ఒక స్కూల్ ని స్థాపించి అక్కడ చదువు నేర్చుకోవాలంటే విద్యార్ధులు ప్రతి ఒక్కరు రోజుకి 4 పాత ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తీసుకు రావాలని కండీషన్ పెట్టారు. రోజుకి నాలుగు అంటే వారానికి సుమారుగా ఒక పాతిక పాత ప్లాస్టిక్ బాటిల్స్ అన్నమాట. అలా డబ్బులు ఇచ్చిన వారికి కూడా సీటు ఇవ్వరు కానీ అలా ప్లాస్టిక్ బాటిల్స్ తెస్తే మాత్రం సీటు ఇచ్చేస్తారట. అంతేకాదు అక్కడ ప్రైమరీ స్టూడెంట్స్ కి హై స్కూల్ పిల్లలతో క్లాసులు కూడా చెప్పిస్తారట. అలా పిల్లల్లో చిన్నప్పటి నుంచే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఏర్పడేలా చేస్తున్నారట. వీరు చేపట్టిన ఈ మంచి పని వల్ల అక్కడ పరిసరాలన్నీ చాలా పరిశుభ్రంగా మారాయని తెలుస్తుంది.

చదువు నేర్పిస్తూ సమాజంలో ఒక పెద్ద సమస్యని కూడా చాలా తేలికగా విద్యార్ధులకు అర్ధమయ్యేలా చేస్తూ సమస్య పరిష్కారాన్ని వారి ద్వారానే చేపట్టడం అనేది చాలా గొప్ప పని అని చెప్పొచ్చు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి మార్పు వస్తే విద్య, పరిశుభ్రత రెండు అద్భుతంగా జరుగుతాయి.

Also Read:  Skanda : ‘స్కంద’ నుండి ఊర మాస్ సాంగ్ రిలీజ్..