Venu Swamy Love Story: వేణు స్వామి శ్రీవాణిల ప్రేమ వివాహం

వేణు స్వామి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఓ సంచలనం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన వార్తల్లో నిలుస్తుంటాడు. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇస్తూ వేణు స్వామి

Venu Swamy Love Story: వేణు స్వామి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఓ సంచలనం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన వార్తల్లో నిలుస్తుంటాడు. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇస్తూ వేణు స్వామి పాపులారిటీ సంపాదించాడు. గతంలో సమంత, నాగ చైతన్య పెళ్లి సమయంలో తమ జాతకాలను బట్టి ఎక్కువ కాలం కలిసి జీవించే అవకాశం లేదని చెప్పి అందర్నీ తనవైపుకు చూసేలా చేశాడు.

వేణుస్వామి భార్య వీణా నైపుణ్యంతో తెలుగు రాష్ట్రాలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖురాలు.వేణుస్వామి, శ్రీవాణిల ప్రేమ వివాహం ఆసక్తికరంగా సాగిందట. శ్రీవాణిది ఆంధ్ర ప్రాంతానికి చెందిన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. బాల్యం నుండి విలువలు మరియు కట్టుబాట్ల మధ్య పెరిగింది. దీనికి తోడు మంచి తెలివితేటలు. ఆత్మగౌరవం కూడా ఎక్కువ. తన కాళ్లపైనే బతికే స్వభావం ఉన్న శ్రీవాణి ఇంటర్ చదివే రోజుల నుంచి పిల్లలకు వీణా పాఠాలు చెప్పేది. సంపాదించిన డబ్బును తన ఖర్చులకు వినియోగించేవారు.

శ్రీవాణికి ఆర్‌ఆర్‌బీ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగ శిక్షణ కోసం హైదరాబాద్ వచ్చింది. ఆ శిక్షణ సమయంలోకూడా తన ఖర్చులకు తగ్గట్టుగా వీణా క్లాసులు చెప్పేవారు. ఒకరోజు క్లాస్ అయిపోగానే ఓ వ్యక్తి తనతో పాటు శిక్షణ తీసుకుంటున్న అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చాడు. అక్కడ శ్రీవాణిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. ఇలాంటి అమ్మాయితోనే జీవితం గడపాలని నిశ్చయించుకున్నారు. ఆయనే వేణుస్వామి. అప్పటికి అతను సాధారణ వ్యక్తి.

వేణుస్వామి తన మేనమామ కూతురిని తీసుకుని వచ్చి శ్రీవాణిని చూడగానే తరచు అక్కడికి రావడం మొదలుపెట్టాడు. మెల్లగా వారిద్దరూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత ఓ రోజు నన్ను పెళ్లి చేసుకుంటావా అని వేణుస్వామి ఆమెను అడిగాడు. ఆ తర్వాత అతని మంచితనం చూసి శ్రీవాణి ఓకె చెప్పిందట.

వాణిశ్రీ వీణను అద్భుతంగ వాయిస్తూ.. ఇంటి పేరును ‘వీణ శ్రీవాణి’గా మార్చుకుంది. వీణ తన అద్భుతమైన నైపుణ్యంతో చిత్ర పరిశ్రమలో కళాకారిణిగా కొనసాగుతోంది. తన భర్త సలహా మేరకే సినిమా పాటలు కూడా కంపోజ్ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాతే తనకు గుర్తింపు వచ్చిందని ఆనందంగా చెప్పింది. చాలా స్టేజీలలో ప్రదర్శనలు కూడా ఇచ్చింది.

వేణుస్వామి విభిన్న శైలిలో జ్యోతిష్యం చెప్పడం ఆయన ప్రత్యేకత. అతని ఉదాహరణలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. 2002లో శ్రీవాణితో వివాహం జరిగింది. అందం, అద్భుతమైన టాలెంట్ ఉన్న అమ్మాయి వేణుస్వామితో ఎలా ప్రేమలో పడింది? అనేది చాలా మందికి ఉండే సందేహం. అందం గురించి అస్సలు పట్టించుకోను అని శ్రీవాణి చెప్పింది. అంతేకాదు ఈరోజు మా అయన తిరుపతి లడ్డూలా కనిపిస్తున్నాడు. ఒక సంవత్సరం తర్వాత నేను అలా ఉండవచ్చు. అందం ముఖ్యం కాదు. మానవ స్వభావం ముఖ్యం అని ఆమె అన్నారు. ఆ ఒక్క సమాధానంతోనే ఆమె మనసు ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.

శ్రీవాణి తనకు వేంకటేశ్వర స్వామి ఇచ్చిన కానుక అని వేణుస్వామి భావిస్తారు. అంతేకాదు ఆమెను దేవతలా చూసుకుంటారు. తనకు ఏ కష్టం వచ్చినా వదలనని చెప్పాడు. మంచి ప్రతిభ, అందం.. నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చింది. నేను అద్భుతంగా కనిపించాలి అని వేణుస్వామి అంటున్నాడు.తన భర్త లాంటి పురుషులు చాలా అరుదు అని శ్రీవాణి చెప్పింది. భార్య భావోద్వేగాలను అర్థం చేసుకునే ఇలాంటి పురుషులు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పింది.

Also Read: Pooja: తులసి మొక్క, పూజా మందిరం.. ఈ రెండింటిలో మొదటి పూజ ఎక్కడ చేయాలో మీకు తెలుసా?