Vande Metro : `వందే భార‌త్` త‌ర‌హాలో మెగా సిటీల‌కు వందే మెట్రో రైళ్లు

వందే మెట్రో రైళ్లు(Vande Metro)ఈ ఏడాది ప‌రుగు పెట్ట‌బోతున్నాయి.

  • Written By:
  • Publish Date - February 6, 2023 / 02:45 PM IST

వందే మెట్రో రైళ్లు(Vande Metro) ఈ ఏడాది ఆఖ‌రి నాటికి ప‌రుగు పెట్ట‌బోతున్నాయి. దేశం లోని ప్ర‌ధాన న‌గ‌రాల‌ను కేంద్రంగా చేసుకుని క‌నీసం 100 కిలోమీట‌ర్ల ప‌రిధిలోని సిటీల‌ను క‌లుపుతూ ఈ మెట్ర‌లోను న‌డ‌పాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. డిసెంబ‌ర్ నాటికి వందేభార‌త్ రైళ్ల (Trains) మాదిరిగా వందే మెట్రో రైళ్ల‌ను ప‌రిచ‌య‌డం చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మేర‌కు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్ ప్ర‌క‌టించారు.

 ఈ ఏడాది ఆఖ‌రి నాటికి వందే మెట్రో రైళ్లు(Vande Metro)

వందే భార‌త్, వందే మెట్రో రైళ్ల( Vande Metro) మ‌ధ్య వ్య‌త్యాసం ఏమిటి? అనేది గ‌మ‌నిస్తే, మెట్రో న‌గ‌రాల‌ను ప్ర‌స్తుతం వందే భార‌త్ రైళ్లు అత్యంత త‌క్కువ స‌మ‌యంలో క‌లుపుతూ వేగంగా వెళుతున్నాయి. సుదూర ప్రాంతాల‌కు అత్యంత వేగంతో వెళుతూ భార‌త దేశంలోని ప్రధాన న‌గ‌రాల‌ను క‌లుపుతున్నాయి. సేమ్ టూ సేమ్ వందే భార‌త్ రైళ్ల (Trains)మాదిరిగానే ఉండే వందే మెటో రైళ్ల‌ను డిజైన్ చేస్తున్నారు. వందే భార‌త్ మినీ వ‌ర్ష‌న్ గా కేంద్రం చెబుతోంది. క‌నీసం 100 కిలో మీట‌ర్లు ఉండే పెద్ద న‌గ‌రాల‌ను క‌లుపుతూ వందే మెట్రోల‌ను న‌డ‌పాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఫ‌లితంగా వ్యాపారులు, విద్యార్థులు, వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అనువుగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2024-25లో వందే మెట్రో ఉత్పత్తిని పెంచనున్నారు.

Also Read : Three More Vande Bharat Trains: తెలంగాణకు త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు

యూరప్‌లోని ‘రీజినల్ ట్రాన్స్’ రైళ్ల మాదిరిగానే వందే మెట్రో (Vande Metro)కాన్సెప్ట్ ఉంటుంది. లోకల్ రైళ్లను పోలి ఉంటాయి. కానీ, చాలా వేగంగా ప్రయాణిస్తాయి. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి షటిల్ లాంటి అనుభూతిని అందించే వేగవంతమైన రైలు వందే మెట్రో అంటున్నారు కేంద్రం పెద్ద‌లు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులోని 16 కోచ్‌ల బ‌దులుగా వందే మెట్రో రైలు ఎనిమిది కోచ్‌లతో చిన్నదిగా ఉంటుంది. పెద్ద నగరాల్లోని చిన్న మార్గాలను కనెక్ట్ చేయడానికి డిజైన్ ఉంటుంది. విద్యార్థులు, వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, సేవా పరిశ్రమకు వ్యక్తులు సౌకర్యంతో ఉద్యోగానికి వెళ్లి తిరిగి స్వస్థలాలకు వెళ్ల‌డానికి అనువైన వాటిగా వందే మెట్రోల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

వందే మెట్రోను పొందే తొలి రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్లు. లక్నోలోని రీసెర్చ్ డిజైన్, స్టాండర్డ్ ఆర్గనైజేషన్ 8-కోచ్‌ల వందే మెట్రో రైలును వీలున్నంత త్వ‌ర‌గా త‌యారు చేయాల‌ని కేంద్రం ఆదేశించింది. వందే మెట్రో రైళ్లు(Vande Metro) అధిక ఫ్రీక్వెన్సీలో న‌డిపిస్తారు. వందే మెట్రోను పొందే తొలి రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ ప్ర‌ధ‌మంగా ఉంది. ఆ రాష్ట్రంలోని పెద్ద నగరాలు – లక్నో – కాన్పూర్ మ‌ధ్య 90 కిలో మీట‌ర్లు ఉంది. ఆ రూటు లో తొలి వందే మెట్రో రానుంది. అలాగే, బీహార్‌లోని పాట్నా -దర్భంగా మ‌ధ్య 140 కిలోమీటర్ల దూరం ఉంది. భవిష్యత్తులో వందే మెట్రోను నడపడానికి ఈ రూటును రెండో ప్రాధాన్యం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Also Read : Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణ చార్జీ ఎంతో తెలుసా..?

చెన్నైతో పాటు లాతూర్ (మహారాష్ట్ర), సోనిపట్ (హర్యానా), రాయ్‌బరేలి (ఉత్తరప్రదేశ్)లలో కూడా వందే భారత్ రైళ్లను తయారు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రైల్వేలు ప్రతి వారం రెండు లేదా మూడు వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని వైష్ణవ్ అన్నారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ భారతీయ రైల్వేలకు మూలధన వ్యయాన్ని అత్యధికంగా రూ.2.40 లక్షల కోట్లకు పెంచింది. నిధుల కేటాయింపులో ఎక్కువ భాగం ట్రాక్‌ల పునరుద్ధరణ, గేజ్ మార్పిడి మొదలైన వాటి కోసం ఉపయోగించబడుతుండగా, మరిన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను (Trains)ప్రారంభించడానికి ఎక్కువ‌ మొత్తం ఉపయోగించబడుతుంది. పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మరో 100 విస్టాడోమ్ కోచ్‌లను తయారు చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది.