Unique Bell – Ayodhya : అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జనవరి 22న జరగబోతోంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా 2500 కిలోల భారీ గంట నిలువబోతోంది. దీన్ని ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లా జలేసర్‌కు చెందిన ఆదిత్య మిట్టల్ కుటుంబం తయారు చేసింది. ఈ భారీ గంట తయారీకి రూ.25 లక్షలను ఖర్చు చేసింది. ఈ గంటను అయోధ్య రామాలయానికి విరాళంగా ఇస్తామని ఆదిత్య మిట్టల్ కుటుంబం ప్రకటించింది. తమ గంటను విరాళంగా స్వీకరించేందుకు అయోధ్య రామ మందిర నిర్మాణ ట్రస్ట్ కూడా అంగీకరించిందని పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
- ఆదిత్య మిట్టల్ కుటుంబం ఈ గంట తయారీకి జింక్, రాగి, సీసం, టిన్, నికెల్, వెండి, బంగారం వంటి లోహాలను వాడింది.
- ఈ గంటను మోగించినపుడు.. ఓంకార శబ్దం వస్తుంది.
- మన దేశంలోని చాలా దేవాలయాలలో జలేసర్‌లో తయారుచేసిన గంటలు వాడుతున్నారు.
- జలేసర్ నేల ప్రత్యేకం. ఇక్కడి మట్టిలో గంటలను అచ్చు వేయడం వల్ల ఓం అనే శబ్దం వస్తుందని చెబుతుంటారు.
- అయోధ్య రామాలయానికి ఇవ్వనున్న భారీ గంట 6 అడుగుల ఎత్తు, 5 అడుగుల పొడవు, 15 అడుగుల వ్యాసార్థం.
- ఈ గంట తయారీలో 250 మంది కార్మికులు పాల్గొన్నారు.
- గంట తయారీకి దాదాపు మూడు నెలల టైం(Unique Bell – Ayodhya) పట్టింది.