Madras Day : హ్యాపీ బర్త్ డే మద్రాస్ !!
ఇవాళ మద్రాస్ సిటీ 384వ బర్త్ డే..
అదేనండి.. ఇప్పుడు మనం చెన్నైగా పిలుచుకుంటున్న మద్రాస్ సిటీ ఆవిర్భవించిన రోజు (ఆగస్టు 22) ఇది.
Also read : Tomato Prices: తక్కువ ధరలకు టమాటాలు విక్రయించనున్న ప్రభుత్వం.. ఎప్పటివరకు అంటే..?
1639 ఆగస్టు 22న దక్షిణ తమిళనాడు రాష్ట్రంలో మద్రాసు నగరాన్ని బ్రిటీష్ వారి “ఈస్ట్ ఇండియా కంపెనీ” స్థాపించింది. మద్రాసు (చెన్నై) నగరం (Madras) ప్రస్తుతం ఉన్న ప్లేస్ లో మొట్టమొదట సెయింట్ జార్జ్ కోటను నిర్మించారు. అప్పట్లో “ఈస్ట్ ఇండియా కంపెనీ”కంపెనీ అనేది ఒక వ్యాపార సంస్థ మాత్రమే. ఆ కంపెనీలోని బ్రిటీష్ అధికారులు ఆండ్రూ కోగన్, ఫ్రాన్సిస్ డే 1639 ఆగస్టు 22న విజయనగర సామ్రాజ్య వైస్రాయ్ దామర్ల వెంకటాద్రి నాయక నుంచి మద్రాస్ (Madras) పట్నం లేదా చెన్నపట్నం గ్రామాన్ని కొన్నారు. ఆ ఊరిలోనే చెన్నై సిటీకి “ఈస్ట్ ఇండియా కంపెనీ” పునాదులు వేసింది. మద్రాసు నగరాన్ని స్థాపించి నేటికి సరిగ్గా 384 సంవత్సరాలు.
మద్రాస్ (Madras) గురించి ఆసక్తికర విషయాలివీ
- చెన్నై పాత పేరు మద్రాసు (Madras).
- తమిళనాడు ప్రభుత్వం 1996లో మద్రాసు పేరును చెన్నైగా మార్చింది.
- చెన్నై భారతదేశ సాంస్కృతిక, సంగీత రాజధాని. ఈ నగరం శాస్త్రీయ, నృత్య, సంగీత కార్యక్రమాలు మరియు దేవాలయాలకు ప్రసిద్ధి.
- “చెన్నై” అనే పేరు బ్రిటిష్ వారు నిర్మించిన సెయింట్ జార్జ్ ఫోర్ట్ సమీపంలో ఉన్న చెన్నపట్నం గ్రామం నుంచి వచ్చింది.
- చెన్నైలోని కాంచీపురంలో ఏకాంబరేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని 1680లో అలంగనాథ పిళ్లై నిర్మించారు.
- “ఫోర్ట్ సెయింట్ జార్జ్” అనేది భారతదేశంలోని మొదటి బ్రిటిష్ కోట. దీన్ని 1639లో చెన్నై నగరంలో నిర్మించారు.