Hyderabad: హైదరాబాద్ దినదినాన అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. నగర సౌందర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఐటీ పార్కులు, మెట్రో స్టేషన్లు, రెస్టారెంట్లు, కళ్ళు చెదిరే బహుళజాతి భవంతులు, ఎంటర్టైన్మెంట్, నోరూరించే వంటకాలు ఇలా నగరం గురించే చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. దేశ నలుమూలల నుంచి హైదరాబాద్ కు వచ్చి స్థిరపడుతున్నారు. అంతేనా విదేశీయులు సైతం హైదరాబాద్ ని చూసేందుకు వస్తున్నారు.హైదరాబాద్ లో 3 చూడదగ్గ ప్రదేశాల గురించి చూద్దాం.
1. లేక్ ఫ్రంట్ పార్క్: 10 ఎకరాలలో విస్తరించి ఉన్న లేక్ ఫ్రంట్ పార్క్ హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్‌లో HMDA హెచ్ఎండి చే అభివృద్ధి చేయబడింది.రూ.26.65 కోట్ల అంచనా వ్యయంతో ఈ పార్కును రూపొందించినట్లు సమాచారం.
సమయాలు — ఉదయం 5:30 నుండి 11: 30 వరకు
ప్రవేశ రుసుము — పెద్దలు: రూ 50, పిల్లలు: రూ 10, మార్నింగ్ వాకర్స్: నెలకు రూ 100
2. సోలార్ సైకిల్ ట్రాక్: ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి 23 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్‌ని రూపొందించారు. ఈ ట్రాక్‌ను హెల్త్‌వే సైక్లింగ్ ట్రాక్ అని కూడా పిలుస్తారు ట్రాక్‌లోని సౌకర్యాలలో కార్ మరియు సైకిల్ పార్కింగ్, ఫుడ్ స్టాల్స్, సైకిల్ రిపేర్ మరియు రెంటల్ స్టేషన్‌లు, ఫస్ట్ ఎయిడ్ స్టేషన్‌లు, విశ్రాంతి ప్రాంతాలు మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సిగ్నలింగ్ ఉన్నాయి.
4. దుర్గం చెరువు మ్యూజికల్ ఫౌంటెయిన్లు: 40 మీటర్ల పొడవున్న రెండు మ్యూజికల్ ఫౌంటైన్‌లు ఇటీవలే ఆవిష్కరించారు. వాటిని చూసేందుకు అనేక మంది నగర వాసులు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు మీ కుటుంబం మరియు స్నేహితులతో సరదాగా గడపాలనుకుంటే ఈ స్థలాన్ని తప్పక సందర్శించండి.
సమయాలు
సాయంత్రం 7:00 నుండి 10:00 గంటల వరకు
Also Read: Chandrababu Bail Petition : మరోసారి చంద్రబాబు బెయిల్ విచారణ వాయిదా