Regrow Body Parts : కొన్ని జంతువులు, సముద్ర జీవులు, చిన్న జీవులు అవసరాన్ని బట్టి తమ చర్మాన్ని వదిలేసి, కొత్త దాన్ని పునరుత్పత్తి చేసుకుంటాయి. పాత అవయవాలు పోతే.. కొత్త అవయవాలను తిరిగి ఉత్పత్తి చేసుకోగలవు. అలాంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ కలిగిన జీవుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- బల్లులు మన ఇళ్లలో కూడా తిరుగుతుంటాయి. అవి తమ తోకలను వదిలేసి.. కొత్తగా తోకను పెంచుకోగలవు. మాంసాహార జంతువుల నుంచి తప్పించుకునే క్రమంలో బల్లులు తమ తోకలను(Regrow Body Parts) వదిలేస్తుంటాయి.
- మగ జింకలు ఏటా తమ కొమ్ములను తొలగించుకుంటాయి. వాటి స్థానంలో మళ్లీ కొత్త కొమ్ములు వస్తాయి. మునుపటి వాటి కంటే కొత్త కొమ్ములు చాలా విస్తారంగా ఉంటాయి. సంభోగించే సీజన్ సమీపించిన తరుణంలో మగ జింకలు తమ కొమ్ములను తొలగించుకుంటాయి. తద్వారా సంభోగానికి తాము సిద్ధమనే సంకేతాలను ఆడ జింకలకు పంపుతాయి.
- పీతలకు కూడా ఒక స్పెషాలిటీ ఉంది. అవి తాము కోల్పోయిన పంజాలు, కాళ్లను తిరిగి ఉత్పత్తి చేసుకోగలవు. గాయపడినప్పుడు దెబ్బతిన్న భాగాలను కూడా పీతలు వదిలించుకుంటాయి. తదుపరి దశలో వాటికి మళ్లీ ఆ భాగాలు కొత్తగా వచ్చేస్తాయి.
- స్టార్ ఫిష్‌లు కూడా తాము కోల్పోయిన అవయవాలను తిరిగి ఉత్పత్తి చేసుకోగలవు. స్టార్ ఫిష్‌లోని సెంట్రల్ డిస్క్‌లో కొంత భాగం మిగిలి ఉంటే, ఒక వేరుచేయబడిన చేయి నుంచి పూర్తిగా కొత్త స్టార్ ఫిష్ డెవలప్ అవుతుంది. స్టార్ ఫిష్ శాస్త్రీయ నామం ఆస్టెరియాస్ రూబెన్స్.
Also Read :Food Rules : 60 ఏళ్ల దాకా ఒక లెక్క.. 60 ఏళ్ల తర్వాత మరో లెక్క.. !!
- కుకుంబర్స్ చూడటానికి మొక్కలా కనిపిస్తాయి. ఈ జీవులు ఇతర జీవుల నుంచి తమను తాము రక్షించుకునే క్రమంలో అంతర్గత అవయవాలను వదులుకుంటాయి. అయితే ఈ అవయవాలను తిరిగి పెంచుకోగలవు.
- సాలమండర్లు కూడా శరీర అవయవాలను పునరుత్పత్తి చేసుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి తమ అవయవాలు, కళ్ళు, వెన్నుపాము, హృదయాలు, ప్రేగులు, ఎగువ దిగువ దవడలను తిరిగి ఉత్పత్తి చేసుకోగలవు.
- ప్లానరియన్లు చూడటానికి జలగల్లా ఉంటాయి. వీటిని ముక్కలుగా కత్తిరించినా.. ప్రతి భాగం నుంచి మరో కొత్త ప్లానిరియన్ ఉద్భవిస్తుంది.
Also Read :Murali Manohar : లండన్‌లో చదివొచ్చి మొక్కల మీద సినిమా తీస్తున్న డైరెక్టర్.. మొక్కలు నాటితే టికెట్ ఫ్రీ..
గమనిక: పైన ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. దీన్ని ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ ధృవీకరించదు.