History of Political Tours: ఏపీ సెంటిమెంట్ రాహుల్ కు కలిసి వస్తుందా.. పాదయాత్ర అధికారానికి షాట్ కర్ట్ అవుతుందా?

రాహుల్ గాంధీ...కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేత. ఆ పార్టీకి అధ్యక్షుడిగానూ బాధ్యతలు చేపట్టినవారు. అతి పురాతన పార్టీకి ప్రాతినిధ్య వహిస్తున్న వ్యక్తి.

  • Written By:
  • Updated On - September 9, 2022 / 02:27 PM IST

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేత. ఆ పార్టీకి అధ్యక్షుడి గానూ బాధ్యతలు చేపట్టినవారు. అతి పురాతన పార్టీకి ప్రాతినిధ్య వహిస్తున్న వ్యక్తి. గొప్ప రాజకీయ కుటుంబంగా ఉన్న గాంధీ కుటుంబానికి చెందిన ఐదవ తరం వారుసుడు. ఇప్పటికి నాలుగుసార్లు లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జాతీయ రాజకీయాల్లో తనదైన మార్క్ వేసుకున్న యంగ్ లీడర్. అలాంటి రాహుల్ ఇప్పుడు అత్యంత సాహసంతో పాదయాత్ర చేప్టారు. భారత్ జోడో పేరుతో ఈ యాత్రనే కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 5 నెలల పాటు సాగనుంది. 12 రాష్ట్రాల్లో 3,500 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ పాదయాత్రను చేపట్టారు.

భారత రాజకీయాల్లో ఈ యాత్రలకు ప్రముఖ స్థానం ఉంది. గత నాలుగు దశాబ్దాల్లో ఐదు యాత్రలు భారతదేశ రాజకీయ వాతావరణాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఇక్కడ గమనించాల్సి ముఖ్య విషయం ఏంటంటే…ఈ ఐదు యాత్రల్లో నాలుగు రాష్ట్రా స్థాయిలో ఉన్నాయి. అందులోనూ నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సాగడం విశేషం. ఇప్పుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఒక్కటే జాతీయ స్థాయిలో కొనసాగుతోంది. కాగా దేశంలో ఇప్పటివరకు చేపట్టిన నాలుగు పాదయాత్రలు ఏంటి. ఎవరు చేపట్టారు.. ఎంతవరకు సక్సెస్ అయ్యారో తెలుసుకుందాం.

Also Read:   AP Kuppam Politics: బాబు కంచుకోటలో ‘జగన్‘ దూకుడు!

1982: ఎన్టీఆర్ ప్రజా చైతన్య రథ యాత్ర:
1982వ సంవత్సరంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు ఆంధ్రప్రదేశ్ లో ప్రజా చైతన్య రథ యాత్ర పేరుతో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర 75వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా సాగింది. రాష్ట్రంలో నాలుగు సార్లు తిరిగి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. 29 మార్చి 1982న ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవం సమస్యపై తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశంలోనే తొలి రాజకీయ రథ యాత్రను చేపట్టారు. యాత్ర అనంతరం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో 294 స్థానలకు గాను టీడీపీకి 199సీట్లలో విజయాన్ని సాధించింది. ఏపీలో మొదటి కాంగ్రెసేతర సీఎంగా ఎన్టీఆర్ ఎన్నికయ్యారు.

Also Read:   PM On Netaji: నేతాజీ పథంలో భారత్‌ నడిచి ఉంటే.. మరింత అభివృద్ధి చెంది ఉండేది : మోడీ

1990: రామరథ యాత్ర చేపట్టిన అద్వానీ:
1990లో రామమందిర నిర్మాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ బీజేపీ దేశవ్యాప్తంగా పర్యటించింది. ఈ యాత్ర అయోధ్య వరకు సాగింది. అద్వానీ ఈ యాత్రకు రథసారథిగా ఉన్నారు. సెప్టెంబర్ 25న గుజరాత్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సోమనాథ్ ఆలయం నుంచి రథ యాత్ర ప్రారంభమైంది. పట్టణాలు, గ్రామాల గుండా ఈ యాత్ర బీహార్ చేరుకుంది. సమస్తిపూర్ లో రథ యాత్రను అడ్డుకుని బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్..అద్వానీని అరెస్టు చేశారు. ఈ రథ యాత్ర ద్వారే బీజేపీకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. ప్రజల్లోనూ ఆదరణ లభించింది. అప్పటి నుంచి బీజేపీ రాయకీయ ప్రయాణం కొత్త మలుపు తిరిగింది. రథ యాత్రలో భాగంగా పెద్దెత్తున ప్రజలు ఈ ఉద్యమంలో కరసేవకులుగా అయోధ్యకు చేరుకున్నారు. ఈ యాత్ర తర్వాత వచ్చిన లోకసభ ఎన్నికల్లో బీజేపీకి 120 సీట్లు వచ్చాయి.

Also Read:   KING CHARLES: బ్రిటన్ తర్వాతి రాజుగా ప్రిన్స్ ఛార్లెస్

2004: వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర:
2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని చేవెళ్ల పట్టణం నుంచి 1500కిలో మీటర్ల మేర పాదయాత్రను కాంగ్రెస్ సీనియర్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ యాత్ర మొత్తం 11 జిల్లాల మీదుగా సాగింది. ప్రజలు వైఎస్సార్ ఆధరించారు. అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. వైఎస్సార్ పాదయాత్రలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు వింటూ ముందుకు సాగారు వైఎస్సార్. పాదయాత్ర అనంతరం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గానూ కాంగ్రెస్ 185 సీట్లు గెలుచుకుని సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టి…10ఏళ్ల టీడీపీ పాలనకు చరమగీతం పాడారు.

Also Read:   AP Politics: కృష్ణా జిల్లా రాజ‌కీయంపై చంద్ర‌బాబు ఫోక‌స్

2012: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్న మీకోసం పాదయాత్ర:
2012 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున హిందూపురం నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఆర్థికంగా, రాజకీయంగా ఛిన్నాభిన్నం చేసిన నేపథ్యంలో ప్రజలకు భవిష్యత్తు మీద భరోసా ఇచ్చేందుకు ఈ యాత్రను చేపట్టారు. అందుకే వస్తున్నా మీ కోసం అంటూ పేరు పెట్టారు. ఉమ్మడి ఏపీలో 13 జిల్లాల గుండా 2817 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టి రికార్డ్ నెలకొల్పారు. 2104లో ఏపీలో అధికారంలో వచ్చారు.

Also Read:   Jagananna Sports Club APP : జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ప్రారంభించిన మంత్రి ఆర్.కే.రోజా

2017: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర:
2017లో ఏపీలో చేపట్టిన ఈ యాత్ర…యువ నేత జగన్ మోహన్ రెడ్డిని సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత కాంగ్రెస్ ను విడిచిన జగన్…వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పాదయాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్లారు. ఈ పాదయాత్రే జగన్ రాజకీయ జీవితానికి వెన్నెముకగా మారింది. 2017నవంబర్ 6న కడప జిల్లా నుంచి పాదయాత్ర చేపట్టి …13 జిల్లాల్లో 125 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 3,648 కిలోమీటర్లు పాదయాత్రను కొనసాగిస్తూ శ్రీకాకుళం చేరుకుంది. ఈ పాదయాత్ర తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 175స్థానాలకు గానూ వైఎస్సార్ కాంగ్రెస్ 152 సీట్లు గెలుచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు జగన్ మోహన్ రెడ్డి.