Site icon HashtagU Telugu

National Education Day : జాతీయ విద్యా దినోత్సవం.. నేటికీ అందని ద్రాక్షగా ఉన్నత విద్య

National Education Day 2024 Maulana Abul Kalam Azad Educational Schemes

National Education Day : మౌలానా అబుల్ కలాం ఆజాద్..  మన దేశ తొలి విద్యాశాఖ మంత్రి.  ఆయన జయంతిని పురస్కరించుకొని ఏటా నవంబర్ 11న మనం జాతీయ విద్యా దినోత్సవం జరుపు కుంటాం. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ 1947 నుంచి 1958 వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా సేవలు అందించారు. స్వతంత్ర భారతంలో ఎక్కువకాలం విద్యాశాఖ మంత్రిగా సేవలు అందించింది ఆయనే. ఆజాద్‌ హయాంలోనే 1948లో డాక్టర్‌ రాధాకృష్ణన్‌ అధ్యక్షతన యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఏర్పాటైంది. 1954లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్  (యూజీసీ)‌ను నెలకొల్పారు. 1964లో డీఎస్‌ కొఠారి అధ్యక్షతన ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఏర్పాటుకు సన్నాహాలు.. ఆజాద్ హయాంలోనే జరిగాయి. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్న టైంలోనే బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌తో పాటు పలు ఐఐటీలు, ఐఐఎంలు, విశ్వవిద్యాలయాలు షురూ అయ్యాయి.

Also Read :Onion Prices : ఉల్లి ధరల మంట.. ఉత్తరాదిలో కిలో రూ.100.. తెలుగు రాష్ట్రాల్లోనూ పైపైకి

అన్ని వర్గాల వారికి, అన్నిప్రాంతాల వారికి విద్యాఫలాలు సమానంగా అందినప్పుడే దేశ భవిష్యత్‌(National Education Day) మరింత ప్రగతి పథంలో పయనిస్తుందని మౌలానా అబుల్ కలాం ఆజాద్ తరుచుగా చెబుతుండేవారు. ప్రస్తుతం దేశంలో 1043 వర్సిటీలు, 42,343 కళాశాలలతో పాటు మరో 11,779 విద్యాసంస్థలు ఉన్నాయి. అయితే వీటిలో 78.6 శాతం కాలేజీలు  ప్రైవేట్‌ రంగంలోనే ఉన్నాయి.

Also Read :MNJ Cancer Hospital : ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో ఏఐ థెరపీ యంత్రం.. రూ.లక్షల చికిత్స ఫ్రీ

2020-21లో వెలువడిన ఒక రిపోర్టు ప్రకారం..  మన దేశంలోని 18-23 ఏళ్లలోపు వారిలో 28.4 శాతం మందే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. పురుషుల్లో 28.3 శాతం మంది, మహిళల్లో 28.5 శాతం మంది మాత్రమే ఉన్నత చదువులు చదవగలుగుతున్నారు.  ఎస్సీల్లో 25.9శాతం మంది, ఎస్టీల్లో 21.2శాతం మంది మాత్రమే ఉన్నత విద్యను అందుకో గలుగుతున్నారు. దేశంలోని ప్రఖ్యాత సెంట్రల్ యూనివర్సిటీల్లో 41 శాతం టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2023 జులై 1 నాటికి మొత్తం 54,512 అధ్యాపక పోస్టుల్లో 22,412 మాత్రమే భర్తీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంబంధించి 18,940 టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో దాదాపు రెండు వేల బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి.