Site icon HashtagU Telugu

Telugu Language Day 2023 : అమ్మ ప్రేమలా కమ్మనైనది తెలుగు భాష

Telugu Language Day 2023

Telugu

Telugu Language Day : దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవ రాయలు చెప్పిన..చెయ్యేతి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తీ గలవోడా అనే వేములపల్లి గీతం ఆలపించిన తెలుగువారి రోమాలు నిక్కపొడుస్తాయి. దేశంలో 22 అధికారక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష.

ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966 లో తెలుగు ను రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం లోను తెలుగు ను అధికారిక భాష గా గుర్తించారు. ఇక 2008 లో కన్నడ తో పాటు తెలుగును ప్రాచీన భాష గా గుర్తించారు. హిందీ , బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునే భాష తెలుగు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో తెలుగు ను మాట్లాడేవారు ఉన్నారు. కేవలం మన దేశంలోనే కాదు అమెరికా , ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ తదితర దేశాల్లోనూ తెలుగు విరాజిల్లుతుంది.

మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం. మనం తల్లిని ఎంత గౌరవం ఇస్తామో, మన మాతృభాష ని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు, ఆంగ్లం కావచ్చు, హిందీ కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది. మనం తెలుగు భాష తక్కువ అని అనుకోకూడదు. తెలుగు భాష కి చాలా చరిత్ర ఉంది. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు.

గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది.

Read Also : Vyara Politics : బద్ద శత్రువులు ఒకటయ్యారు..ఇక వైరా లో గులాబీ గెలుపు ఖాయమేనా..?

తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి , తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసేందుకు గిడుగు వెంకట రామమూర్తి (Gidugu Ramamurthy) ఎనలేని కృషి చేసాడు. అయన అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా గిడుగు రామమూర్తి జయంతినే (Gidugu Ramamurthy Birth Anniversary) మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వికాసారానికి పాటుపడిన వారు ఎవరని అడిగితే వెంటనే గుర్తుకొచ్చే వారిలో వీరేశలింగం , గురజాడ లు ఎప్పుడు ఉంటారు. వారికీ సమంత స్థాయిలో కృషి చేసిన వారు గిడుగు రాంమూర్తి.

తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించింది. అందులో ఎందరో కవులు, రచయితలు గ్రంధ కర్తలు చాలా చాలా రచనలు చేశారు. పర భాష లను గౌరవించడమే తెలుగు భాష, తెలుగు వారి గొప్పతనం. ప్రపంచపు తెలుగు మహాసభలు అమెరికాలోనూ , పశ్చిమ ఆసియా లోనూ , ఆంధ్ర తెలంగాణ లోనూ ప్రతి సంవత్సరం జరుగుతాయి. అమెరికా తెలుగు వారింకా తెలుగుని గౌరవిస్తున్నారంటే, దానర్ధం తెలుగు చాలా గొప్పదనేగా.

Read Also : Neha Shetty : క్లివేజ్ అందాలతో మతి పోగొడుతున్న నేహా శెట్టి

తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి. గొప్పవాళ్లు రాసిన రచనలు పద్యాలు, గద్యాలు, గేయాలు, కథలు, కవితలు, పల్లెగీతాలు, కూనిరాగాలు, ఇంకా హాస్య రచనలు, విప్లవ రచనలు , విప్లవ గీతాలు చదవాలి. అన్నిటిలోనూ వారు చేసే భావ ప్రకటన, కొత్త కొత్త పదాలు, ప్రాసలు, సంగీతాలంకారాలు, జ్ఞానం, చరిత్ర తెలుస్తాయి. మన భాషలో ఎన్నో గొప్ప భకృ గీతాలు, మహాభారతం, రామాయణం , భాగవతం, దశావతారాలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. మనం ఈకాలంలో ఇవేవీ చదవకుండా పాశ్చాత్య సంస్కృతి పైనే ఎక్కువ మక్కువ చూపడం న్యాయం కాదు పద్ధతి కాదు. అది మాతృ ద్రోహం చేయడమే.

తెలుగు భాష గొప్పతనం గురించి తెలుగు పుస్తకాలు :

మన మాతృభాష తెలుగు భాష గొప్పతనం గురించి కవులు, రచయితలు ఏనాడో మనకు తెలుగు సాహిత్యంలో తెలియజేశారు. అటువంటి తెలుగు పుస్తకాలు చదివితే, తెలుగు భాష గొప్పదనం తెలుస్తుంది. మాతృభాష ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది. తెలుగు భాష తియ్యదనం… తెలుగుజాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక మూలదనం… తల్లితండ్రి నేర్పినట్టి మాతృ భాషరా… తెలుగు మరిచిపోతే, వాళ్ళని నువ్వు మరిచనట్టేరా… ఈ పాట నిజమే కదా…!

చరిత్ర కూడా మనకు పుస్తకరూపంలోనే ఉంటుంది. అటువంటి చరిత్రలో మన ప్రాంతం గురించి, మన మాతృభాషలో అయితే చక్కగా వివరించి ఉంటుంది. తెలుగు భాషలోని పుస్తకాల వలన తెలుగువారి ఘన చరిత్ర ఏమిటో… మనకు బాగా అర్ధం అవుతుంది. తెలుగు పద్యాలు మనకు తెలుగు భాష విశిష్టతను బాగా తెలియజేస్తాయి. కొన్ని పదాలలోనే ఎంతో పరమార్ధం తెలుగు పద్యాలలో ఉంటుందని అంటారు. ఒక్కొక్క తెలుగు పద్యం అయితే, సమాజంలో ఉండే వివిధ స్వభావాలను ఎత్తి చూపుతూ ఉంటాయి. బహుశా ఇలా పద్యములలో ఎంతో అర్ధం వచ్చేలా ఉండడం, తెలుగు భాష విశిష్టతను తెలియజేస్తుంది.

Read Also : Vinayaka Chavithi : భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సమావేశం.. హైదరాబాద్‌లో వినాయకచవితి, నిమజ్జనం ఎప్పుడంటే..

దేశభాషలందు తెలుగు లెస్స అని అలనాటి చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు అన్నాడు. ఆయన కాలం లో తెలుగు బాగా అభివృద్ధి చెందినది. (విజయవాడ దగ్గరి ) శ్రీకాకుళ ఆంధ్రవిష్ణు అని పేరుపొందిన రాజు తెలుగుని ప్రోత్సహించారు. తెలుగు లో పద్యాలు క్లుప్తంగా ఉంటాయి ఎంతో అర్ధాని ఇస్తాయి. నన్నయ, తిక్కన, ఎఱ్ఱన (ఎఱ్ఱాప్రగడ), తెనాలి రామకృష్ణ కవి, ముక్కు నంది తిమ్మన, తిరుపతి వెంకట కవులు, వేమన, బమ్మెర పోతన లాంటి మహా మహులు తెలుగు లో రచనలు చేసి జాతి గౌరవాన్ని, భాష స్థాయిని ఆకాశానికి ఎక్కించారు.

త్యాగరాజు కృతులు, అన్నమయ్య కీర్తనలు కోట్లాది మండి నోళ్లలో ఎపుడూ నానుతూనే ఉంటాయి. క్రీస్తు పూర్వం 300 వ సంవత్సరం లోనే భట్టిప్రోలు కవి తన రచనలు చేశాడు. చాళుక్యుల కాలం లో , ఇక్ష్వాకుల కాలం లో తెలుగు ఎంతో అభి వృద్ధి చెందింది. జక్కన, గొన బుద్ధారెడ్డి (రామాయణం), గౌరన కవులు భక్తి రచనలు చేశారు. శ్రీనాధుని కావ్యాలు అతి సుందరమైనవి మరి అత్యంత ఆహ్లాదమైనవి. చిన్నయ సూరి తెలుగు వ్యాకరణాన్ని రాశాడు.

ఆధునిక కవులలో రచయితలలో, విశ్వనాథ సత్యనారాయణ, గురజాడ అప్పారావు, నండూరి సుబ్బారావు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, మహాకవి శ్రీశ్రీ , సి నారాయణ రెడ్డి ఎంతో గొప్పవాళ్లు. సామాజిక సమస్యల పైన ప్రజలకు అవగాహన కలిపిస్తూ ఎన్నో కవితలు, వ్యాసాలు , గేయాలు రాశారు. ఇంత గొప్పభాష తెలుగు భాషాదినోత్సవం తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లల్లో చాలా మంది తెలుగు కంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతున్నారు. తెలుగు చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం వారికి కష్టంగా ఉంటోంది. ఇది ప్రమాదకరమైన అంశం. దీని వల్ల తరాలు మారుతూ ఉంటే… తెలుగు భాష ప్రాధాన్యం తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఎంతైనా మాతృభాష తల్లి లాంటిది. దాన్ని దూరం చేసుకోకూడదు. మనం మన భావాల్ని వ్యక్తం చేయడానికి మాతృభాషను మించినది ఏముంది? మరి ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా.. మీ పిల్లలకు కాస్త తెలుగు నేర్పించండి.

Exit mobile version