Site icon HashtagU Telugu

SwaRail vs IRCTC : ‘స్వరైల్’, ‘ఐఆర్‌సీటీసీ’ యాప్‌లలో ఏది బెటర్ ?

Swarail Vs Irctc Rail Connect Railways Tickets Food Orders

SwaRail vs IRCTC : ‘స్వరైల్‌’ (SwaRail) మొబైల్ యాప్ గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఈ యాప్‌ను ఇటీవలే రైల్వే శాఖ ప్రారంభించింది. దీన్ని మనం కూడా గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్‌ను తొలి విడతగా 1000 మంది మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఈ వెయ్యి మంది నుంచి సేకరించే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ‘స్వరైల్’ యాప్‌ను మరింతగా తీర్చిదిద్దుతారు. అదనపు ఫీచర్లను జోడిస్తారు. తదుపరి విడతలో స్వరైల్ యాప్‌ను మరో 10వేల మంది డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.

Also Read :Fact Check: స్టార్ క్రికెటర్ సిరాజ్‌‌‌కు విగ్రహాలు.. ఫొటోలు వైరల్

‘స్వరైల్’ యాప్‌‌లోని ఫీచర్లు

Also Read :Manipur CM : ‘‘సీఎం వల్లే హింసాకాండ ?’’.. ఆడియో క్లిప్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఐఆర్‌సీటీసీకి, స్వరైల్‌కు తేడా ఏమిటి ?

  • ‘ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్’ (IRCTC Rail Connect) యాప్ ద్వారా మనం రైల్వే రిజర్వుడ్ టికెట్లను మాత్రమే బుక్ చేసుకోగలం.
  • స్వరైల్ యాప్ ద్వారా మనం రిజర్వుడ్ టికెట్లతో పాటు అన్ రిజర్వుడ్ టికెట్లను కొనొచ్చు. ప్లాట్‌ఫామ్ టికెట్లను సైతం పొందొచ్చు. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డులతో ఆయా టికెట్ల పేమెంట్స్ చేయొచ్చు.
  • ఐఆర్‌సీటీసీ, స్వరైల్.. రెండు యాప్‌లలో కూడా మనం పీఎన్‌ఆర్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.  అయితే మనం చెక్ చేస్తున్న రూట్లలో నడిచే ఇతర ట్రైన్ల వివరాలను కూడా స్వరైల్‌ యాప్‌లో చూపిస్తారు.
  • రీఫండ్ ట్రాకింగ్ రెండు యాప్‌లలో కూడా అందుబాటులో ఉంది.
  • వివిధ రకాల రైల్వే సర్వీసుల కోసం ఐఆర్‌సీటీసీ యాప్‌లో వేర్వేరు లాగిన్‌లు కావాలి. స్వరైల్ యాప్‌లో ఒకే సైన్ ఇన్‌తో అన్ని రకాల రైల్వే సేవలను పొందొచ్చు.
  • స్వరైల్ యాప్ నుంచి రైళ్లలో ఫుడ్ ఆర్డర్స్  ఇవ్వొచ్చు. పార్సిల్ సర్వీసులను ట్రాక్ చేయొచ్చు.
  • ఐఆర్‌సీటీసీ యాప్ కంటే స్వరైల్ యాప్ చాలా చిన్నది. అందువల్ల మీ ఫోనులో ఈజీగా స్టోర్ అవుతుంది. దానివల్ల ఫోన్‌పై పెద్దగా భారం పడదు.