Site icon HashtagU Telugu

Gill and Sara Dating: సారా టెండూల్కర్‌తో గిల్‌ ఎంగేజ్ మెంట్.. ట్వీట్ వైరల్!

Gill And Sara

Gill And Sara

న్యూజిలాండ్‌ జట్టు పై కేవలం 145 బంతుల్లోనే తొలి డబుల్ సెంచరీ (Double Century) తో చెలరేగిన క్రికెటర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కు సంబంధించిన ఓ న్యూస్ ఆసక్తిని రేపుతోంది. వ్యక్తిగత జీవితంపై అతని అభిమానులు సోషల్ మీడియాలో చర్చకు తెరలేపారు. శుభ్‌మాన్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న రూమర్స్ హాట్ టాపిక్ గా మారాయి. కాగా మరోవైపు బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌తో శుభ్‌మాన్ (Shubman Gill) ప్రేమలో ఉన్నాడని కూడా వార్తలొచ్చాయి.

అయితే, సారా అలీ ఖాన్ లేదా శుభ్‌మాన్ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు శుభమాన్ గిల్, సారా టెండూల్కర్ (Sara tendulkar) నిశ్చితార్థాన్ని ప్రకటిస్తూ చేసిన ట్వీట్ నెటిజన్లను షాక్‌కి గురి చేసింది. ఇటీవల డబుల్ సెంచరీ (Double century) సాధించిన అతి పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా శుభ్‌మన్ రికార్డులోకి ఎక్కాడు. డబుల్ సెంచరీ తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్లో కొంతమంది అభిమానులు గిల్ పేరును సారా టెండూల్కర్ కు లింక్ చేయడం మొదలుపెట్టారు. ‘‘బ్రేకింగ్: సారా టెండూల్కర్ #శుబ్‌మాన్ గిల్‌తో కుమార్తె సారా నిశ్చితార్థం’’ అంటూ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

కాగా మరోవైపు సారా అలీ ఖాన్‌తో గిల్ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. “సారా దా సారా సచ్ బోల్ దియా. బహుశా, కాకపోవచ్చు.” అంటూ గిల్ (Shubman Gill) రియాక్ట్ అయ్యాడు. ‘‘ప్రస్తుతం శుభమాన్ డేటింగ్ చేస్తున్నాడు. అయితే, అది సారా టెండూల్కర్ లేదా సారా అలీ ఖాన్ అని మాకు కచ్చితంగా తెలియదు’’  అని మరికొందరు నెటిజన్స్ రియాక్ట్ అయ్యారు. శుభ్‌మన్ గిల్ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదవ భారత ఆటగాడిగా (Team India Player) నిలిచాడు. గతంలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇష్నా కిషన్ ఈ ఘనత సాధించారు. శుభ్‌మన్ గిల్ కేవలం 145 బంతుల్లో 208 పరుగులు చేశాడు.

Also Read: Old Vehicles: 15 ఏళ్లు దాటిన వాహనాలు ఇక తుక్కుకే!