Roja Praises CM Jagan : టికెట్ కోసం ఇంత భజన అవసరమా రోజా..?

మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని చూశారా తెల్ల షర్ట్ వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు

  • Written By:
  • Updated On - August 29, 2023 / 11:48 AM IST

ఎన్నికలు వస్తున్నాయంటే నేతలకు కాస్త టెన్షనే…అధిష్టానం టికెట్ ఇస్తారో లేదో..ఇస్తే ఎక్కడ ఇస్తారో అని..ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారో లేదో అని..ఎన్నికలకు ఈసారి ఇంత ఖర్చు పెట్టాలో అని..అవతలి వ్యక్తిని ఎలా ఢీ కొట్టాలో అని ఇలా అనేక విషయాలపై తర్జనభర్జన చేస్తుంటారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం మొదలుకాబోతుంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. తెలంగాణ లో బిఆర్ఎస్ (BRS) ను గద్దె దించేందుకు కాంగ్రెస్ , బిజెపి పార్టీలు ఆయుధాలు సిద్ధం చేస్తుండగా..ఏపీలో వైసీపీ (YCP) ని గద్దె దించేందుకు టీడీపీ (TDP) , జనసేన (Janasena), బిజెపి (BJP) పార్టీలు సిద్ధం అవుతున్నాయి.

ఈ తరుణంలో వైసీపీ అధికార పార్టీలోని కొంతమంది నేతలకు ఈసారి టికెట్ కష్టమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. వారిలో నగరి ఎమ్మెల్యే రోజా (MLA Roja) ఒకరు. ఎమ్మెల్యే రోజా కు తన సొంత నియోజకవర్గం (Nagari Assembly constituency) లో పూర్తి వ్యతిరేకత ఉంది. సొంత పార్టీ నేతలే ఆమెఫై రగిలిపోతున్నారు. మొదటి నుండి పెద్దిరెడ్డి కి రోజా కు అస్సలు పడదు. ఈ విషయం పలుమార్లు జగన్ సాక్షిగా బయటపడింది. మరోసారి నిన్న జగన్ పర్యటన లో అదే జరిగింది.

నగరి నియోజకవర్గంలో సోమవారం సిఎం జగన్‌ పర్యటనలో (Jagan Nagari Tour ) మంత్రి పెద్దరెడ్డి రామచంద్రా రెడ్డి (Peddireddy Ramachandra Reddy), మంత్రి రోజా వర్గాల మద్య విభేదాలు ఫ్లెక్సీ బ్యానర్లు సాక్షిగా బయటపడ్డాయి. నగరి నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల వైసీపీ నేతలు జగన్‌కు స్వాగతం చెపుతూ దారిపొడవునా అనేక ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. నగరి వైసీపీ ఇన్‌ఛార్జ్‌ కెజె కుమార్, వడమాలపేట వైసీపీ ఇన్‌ఛార్జ్‌ మురళి, పుత్తూరు వైసీపీ ఇన్‌ఛార్జ్‌ అమ్ములు, నిండ్ర వైసీపీ ఇన్‌ఛార్జ్‌ చక్రపాణి ఈ ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. వాటన్నిటిలో జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి, వారి ఫోటోలే ఉన్నాయి. కానీ వాటిలో ఎక్కడా నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఫోటోలు పెట్టలేదు.

Read Also : PMGKAY: లోక్‌సభ ఎన్నికలపై ప్రధాని మోడీ కన్ను.. జూన్ 2024 నాటికి 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇచ్చే యోచన..!

ఈ కార్యక్రమానికి ముందు జగన్‌ స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి వర్గానికి చెందిన కేజే శాంతి చెయ్యి పట్టుకొని పక్కనే ఉన్న మంత్రి రోజాతో చేతులు కలపాలని ప్రయత్నించారు. పార్టీలో నేతలందరూ విభేధాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని జగన్‌ వారికి చెప్పినా ఇద్దరూ చేతులు కలిపేందుకు ఇష్టపడలేదు. జగన్‌ స్వయంగా చెయ్యి పట్టుకొని చెప్పడంతో కేజే శాంతి అయిష్టంగానే రోజా చేతిని తాకారు తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. తర్వాత రోజా మొహం తిప్పుకొని జగన్‌తో కలిసి ముందుకు వెళ్ళిపోయారు తప్ప శాంతితో మాట్లాడలేదు. మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో ఆమె పరిస్థితి ఇది. ఆమెకు సొంత పార్టీలోనే నేతలతో పడదు. ఆమె మంత్రి పదవిలో ఉన్నా ఫ్లెక్సీ బ్యానర్లలో ఆమె ఫోటో కూడా వేయలేదు.

ఇక ఇవేమి పట్టించుకోకుండా వేదిక ఫై సీఎం జగన్ ఫై ప్రశంసలు (Roja Praises CM Jagan) కురిపిస్తూ వచ్చింది రోజా. రోజా మాటలకు జగన్ మూసి మూసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్నప్పటికీ..రోజా భజన మాత్రం సొంత నేతలు కూడా భరించలేకపోయారు. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని చూశారా తెల్ల షర్ట్ వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు. పెద్దవాళ్లను అయితే అన్న అంటారు. ఆడపడుచులను అయితే చెల్లి అని పిలుస్తారు. ఇది చూసి కూడా పవన్ కల్యాణ్ కడుపుమంట. ఆయన కూడా తెల్ల షర్ట్ వేసుకుంటాడు. అన్న అని పిలుస్తాడు. చిరునవ్వులతో పలకరిస్తాడు నమ్మకండి అంటాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నాకన్నా చిన్నవాడు.. నాకన్నా అందంగా ఉంటాడు. నాకన్నా ముందే రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ముందుకు వెళ్తున్నాడు. సక్సెస్ ఫుల్ ఫ్యామిలీ పర్సన్ గా ఉన్నాడు. సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గా ఉన్నాడు.

ఇవన్నీ చూసి పవన్ కల్యాణ్ జలసీ ఫీలవుతున్నాడు. ఆరు నెలలు అయితే వాళ్లు వీళ్లు అవుతారు కదా.. అలాగే చంద్రబాబులా పవన్ కల్యాణ్ కూడా జలసీ ఫీలవుతున్నారని రోజా చెప్పుకొచ్చింది. ఇలా రోజా మాటలకు జగన్ తెగమురిసిపోయిన..అక్కడి జనాలు , పార్టీ నేతలు మాత్రం ఇదే డప్పురా..నాయనా..ఇక చాలు ఆపమని అని మాట్లాడుకున్నారట. మొత్తం మీద టికెట్ కోసం రోజా గట్టి భాజనే చేసిందని టీడీపీ శ్రేణులు సైతం మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.