Ratan Tata : కాసేపట్లో రతన్ టాటా అంత్యక్రియలు.. పార్శీల అంత్యక్రియలు ఎలా చేస్తారు ?

ప్రస్తుత కాలానికి అనుగుణంగా  అంత్యక్రియల(Ratan Tata) పద్ధతులు ఎలా మారాయి ?

Published By: HashtagU Telugu Desk
Ratan Tata Funerals Parsi Religion

Ratan Tata : రతన్ టాటా.. విఖ్యాత పారిశ్రామిక వేత్త.  దేశం గర్వించేలా విలువలతో కూడిన వ్యాపార ప్రపంచాన్ని క్రియేట్ చేసిన ఘనుడు రతన్ ఇక లేరు. ఆయనది పార్శీ మతం. మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రతన్ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి. ముంబైలోని మలబార్ హిల్స్‌లో ఉన్న టవర్ ఆఫ్ సైలెన్స్‌లో అంత్యక్రియల కార్యక్రమం జరుగుతుంది. అయితే పార్శీ మతంలో అంత్యక్రియలు ఎలా చేస్తారు ? ప్రస్తుత కాలానికి అనుగుణంగా  అంత్యక్రియల(Ratan Tata) పద్ధతులు ఎలా మారాయి ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

Also Read :Sight Day 2024 : కంటి ఆరోగ్యంపై మహా నిర్లక్ష్యం.. ‘ప్రపంచ దృష్టి దినోత్సవం’ నేడే

  • చనిపోయిన వారిని హిందువులు దహనం చేస్తారు. క్రైస్తవులు, ముస్లింలు ఖననం చేస్తారు. పార్శీలు ఈ రెండు పద్ధతులను కూడా పాటించరు.
  • పార్శీలు అగ్నిని ఆరాధిస్తారు.
  • పార్శీల ప్రకారం.. చనిపోయిన వారిని ఖననం చేస్తే పవిత్రమైన భూమిని నష్టపరిచినట్టు. దహనం చేస్తే పవిత్రమైన అగ్నిని అవమానించినట్టు.
  • ప్రకృతి ఇచ్చిన శరీరాన్ని ప్రకృతికే  ఇచ్చేయాలని పార్శీ మతం చెబుతోంది. అందుకే చనిపోయిన వారి డెడ్‌బాడీని రాబందులు, పక్షులు తినడానికి ఒక ప్రత్యేకమైన చోటులో వదిలేస్తారు.  ఇది వేల ఏళ్ల కిందటి ఆచారం.  దీన్ని ‘దఖ్మా’ అని పిలుస్తారు. పార్శీలు చనిపోయిన వారి డెడ్‌బాడీస్‌ను ఇలా వదిలేసే ప్రదేశాన్ని ‘టవర్‌ అఫ్‌ సైలెన్స్’ అంటారు.
  • వృత్తాకారంలో రెండు పెద్ద గోడల మధ్య బావి ఉంటుంది. అదే టవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌. ముందుగా మృత దేహాన్ని రాబందులు పీక్కుని తింటాయి. ఆ తర్వాత మిగిలిన ఎముకలు ఆ మధ్యలో ఉన్న బావిలో పడిపోతాయి.
  • టవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌‌లోని  బావికి వృత్తాకారంలో రెండు సర్కిళ్లు ఉంటాయి. బయట సర్కిల్లో పురుషుల మృతదేహాలు, లోపల సర్కిల్లో మహిళల శవాలు, మధ్యలో చిన్న పిల్లల శవాలను ఉంచుతారు. అవి పూర్తిగా డీ కంపోజ్ అయిన తర్వాత మిగిలిన ఎముకలు మధ్యలో ఉన్న బావిలో పడిపోతాయి. రెండేళ్ల తర్వాత అక్కడికి బంధువులు వెళ్లి అవశేషాలను సేకరించి డిస్పోజ్ చేస్తారు. ఇదంతా పాత మాట.
  • ప్రస్తుతం పార్శీలు ఎక్కువగా నగరాల్లోనే ఉంటారు. ఇప్పుడు రాబందులు పెద్దగా లేవు. అందుకే చాలాచోట్ల పార్శీలు అంత్యక్రియల పద్ధతులను మార్చుకున్నారు. డెడ్‌బాడీలు సకాలంలో డిస్పోజ్ కాకపోతే పరిసర ప్రాంతాల్లో కాలుష్యం ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
  • చాలాచోట్ల పార్సీలు కూడా హిందూ సంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

Also Read :Bomb Scare : బాంబులు, ఉగ్రవాదుల కలకలం.. ఆ రైలులో గంటల తరబడి తనిఖీలు

  Last Updated: 10 Oct 2024, 02:20 PM IST