Santiniketan – UNESCO : భారతదేశ జాతీయ గీతం ‘జనగణమన’ను స్వరపరిచిన నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ నివసించిన ఇల్లు ‘శాంతినికేతన్’. దీన్ని ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఆదివారం జరిగిన యునెస్కో సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈసందర్భంగా మీటింగ్ కు హాజరైన భారత అధికారులు.. భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బిర్ముమ్ జిల్లాలో శాంతినికేతన్ ఉంది. దీంతో ఇండియా నుంచి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన ప్రదేశాల సంఖ్య 41కి పెరిగింది. వాస్తవానికి శాంతినికేతన్‌ను రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి మహర్షి దేవేంద్రనాథ్ 1863లో పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌లో స్థాపించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వం వహించి శాంతినికేతన్‌ను.. విశ్వభారతి విశ్వవిద్యాలయంగా మార్చారు. భారతదేశ చరిత్రలో శాంతినికేతన్ ఒక ముఖ్యమైన కేంద్ర బిందువు. శాంతినికేతన్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ అనేక సమావేశాలు నిర్వహించారు. మహాత్మా గాంధీతో ఠాగూర్ చాలాసార్లు భేటీ అయ్యారు. స్వాతంత్య్రానంతరం తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా ఈ భవనంలోనే ఠాగూర్‌ను కలుసుకుని చర్చలు జరిపారు.
Also read : India Vs China : సముద్రంలో ఇండియా వర్సెస్ చైనా.. భారత్ టార్గెట్ 175
మహాకవి రవీంద్రనాధ్ ఠాగూర్ 1861 మే 7న కోల్‌కతాలో జన్మించారు. ఆయనకు చిన్ననాటి నుంచే సాహిత్యంపై ఇష్టం ఉండేది. బడకి వెళ్లడం ఇష్టం లేక.. ఆయన ఇంటి దగ్గరే చదువుకున్నారు. మార్నింగ్ టైంలో గణితం, చరిత్ర, భూగోళ పాఠాలను, సాయంత్రం టైంలో చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీషును ఠాగూర్ నేర్చుకునేవారు. సండే టైంలో సంగీత, భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకునేవారు. బెంగాలీతో పాటు ఆంగ్ల భాషపై రవీంద్రనాథ్ ఠాగూర్ కు మంచి పట్టు ఉంది. అందుకే ఆయన ఇంగ్లిష్ లోనూ అనేక రచనలు చేశారు. ఉన్నత చదువుల కోసం ఠాగూర్ ఇంగ్లాండుకు వెళ్ళారు. ఇంగ్లండులో ఉన్న సమయంలోనే ‘భగ్న హృదయం’ అనే కావ్యాన్ని ఠాగూర్ (Santiniketan – UNESCO) రచించాడు. దీన్ని మొదట బెంగాలీ భాషలో రాసి, అనంతరం ఆంగ్లంలోకి అనువదించారు. ఈ రచనకుగానూ 1913లో సాహిత్యంలో ఠాగూర్ కు నోబెల్ బహుమతి వచ్చింది. 1941 ఆగస్టు 7న రవీంద్రనాథ్ ఠాగూర్ కన్నుమూశారు.