Site icon HashtagU Telugu

Helicopter Puja: యాదగిరిగుట్టలో కొత్త హెలికాప్టర్ కు పూజ.. ధర ఎంతో తెలుసా!

Helicopter Pooja yadadri

Helicopter Pooja

తిరుమల తిరుపతి దేవస్థానంగా పేరొందుతున్న తెలంగాణలోని యాదగిరిగుట్టలో (Yadadri) కొత్త హెలిక్టాపర్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త కార్లు, బైక్స్ కొన్నవారు ఎవరైనా ప్రత్యేక పూజలు చేయడం చాలా కామన్. కానీ ఓ వ్యక్తి ఏకంగా హెలికాప్టర్ (Helicopter) కు ప్రత్యేక పూజలు చేసి అందర్నీ ఆకర్షించాడు.  కరీంనగర్‌ జిల్లాకు చెందిన ప్రతిమ మెడికల్‌ కళాశాల ఎండీ, ప్రతిమ గ్రూప్స్‌ అధినేత బోయినపల్లి శ్రీనివాసరావు నూతనంగా కొనుగోలు చేసిన హెలికాప్టర్‌ (Helicopter)ను యాదగిరిగుట్టకు తీసుకువచ్చారు. హెలికాప్టర్‌ను టెంపుల్‌ సిటీలోని హెలీప్యాడ్‌ వద్ద ల్యాండ్‌ చేశారు. పూజారులు అక్కడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి శ్రీనివాసరావు బంధువైన మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. పూజల అనంతరం హెలికాప్టర్‌లో శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, విద్యాసాగర్‌రావు కుటుంబ సభ్యులు గిరిప్రదక్షిణ చేశారు. బోయినపల్లి శ్రీనివాసరావు టెంపుల్‌ సిటీలోని ప్రెసిడెన్షియల్‌ సూట్‌ విల్లా డోనర్‌ కావడంతో వాహన పూజలు ఉచితంగా నిర్వహించారు. ప్రస్తుతం ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ హెలికాప్టర్ (Helicopter) ధర దాదాపు రూ. 46 కోట్లు ఉన్నట్లు సమాచారం అందుతుంది.

Also Read: Bride And Groom Fight: స్టేజీ మీదే కొట్టుకున్న కొత్త జంట.. చక్కర్లు కొడుతున్న వీడియో