Space Solar Stations : స్పేస్ లో సోలార్ పవర్ స్టేషన్స్.. ఇలా పని చేస్తాయి..

Space Solar Stations : "సోలార్ పవర్" అన్ లిమిటెడ్.. ఫ్యూచర్ లో అంతరిక్షంలోనూ విద్యుత్  ను ఉత్పత్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.. 

  • Written By:
  • Updated On - July 1, 2023 / 11:46 AM IST

Space Solar Stations : “సోలార్ పవర్” అన్ లిమిటెడ్.. 

భూమిపై సోలార్ ప్యానల్స్ తో ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.. 

ఫ్యూచర్ లో అంతరిక్షంలోనూ విద్యుత్  ను ఉత్పత్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.. 

భూమిపై అమర్చే సోలార్ ప్యానల్స్ కంటే 8 రెట్లు ఎక్కువ విద్యుత్తును అంతరిక్షంలో అమర్చే సోలార్ ప్యానల్స్ ఉత్పత్తి చేస్తాయట.

సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది. పూర్తి వివరాలివీ.. 

అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బిగ్ న్యూస్ వచ్చింది. యూనివర్శిటీలోని పరిశోధకులు ఒక్క వైర్ కూడా అవసరం లేకుండా తొలిసారిగా  అంతరిక్షం నుంచి భూమికి సోలార్ పవర్ ను రిసీవ్ చేసుకున్నారు. అంటే అంతరిక్షం నుంచి భూమికి  వైర్ లెస్ విద్యుత్ పంపిణీ జరిగిందన్న మాట. ఈ ప్రయోగ ఫలితం  కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చేపట్టిన స్పేస్ సోలార్ పవర్ ప్రాజెక్ట్‌  “మ్యాపుల్” (MAPLE)లో ఒక భాగం. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో స్పేస్ సోలార్ పవర్ డెమాన్‌స్ట్రేటర్ (SSPD-1) అనే పేరు కలిగిన శాటిలైట్ ను(Space Solar Stations) ప్రయోగించారు. దాన్ని నిర్ణీత అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టారు.

Also read : YS Sharmila: ఓట్ల పండగ రాగానే పోడు రైతులు యాదికొచ్చారా?

అనంతరం SSPD-1  శాటిలైట్  ద్వారా పంపిన రెండు, మూడు మాడ్యులర్ స్పేస్‌క్రాఫ్ట్ లను అంతరిక్షంలోకి రిలీజ్ చేశారు. వాటిపై సోలార్ ప్యానెల్స్, మైక్రోవేవ్ పవర్ ట్రాన్స్‌మిటర్లు, రిసీవర్లు ఉన్నాయి. అంతరిక్షంలో ఉండటం వల్ల సూర్యుడి కిరణాలు నేరుగా వచ్చి స్పేస్‌క్రాఫ్ట్ ల పై ఉన్న సోలార్  ప్యానెల్స్ పై పడతాయి. వాటిని వినియోగించుకొని సోలార్ ప్యానెల్స్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తాయి. ఆ సోలార్ విద్యుత్ ను మైక్రోవేవ్‌లుగా మార్చి.. భూమిపై ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వైర్‌లెస్‌గా ప్రసారం చేస్తాయి. మ్యాపుల్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి తమకు మైక్రోవేవ్‌ రూపంలో సోలార్ విద్యుత్ అందిందని నెల రోజుల క్రితమే  కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెల్లడించింది.

Also read : Criminals Vs Buddhist Monks : నేరాలు చేశాక.. సన్యాసులుగా మారుతున్నారట!!

MAPLE స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్న మైక్రోవేవ్ పవర్ ట్రాన్స్‌మిటర్ల వల్ల ఇది సాధ్యమైందని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తెలిపింది.  సిలికాన్‌తో తయారు చేసిన ఎలక్ట్రానిక్ చిప్ ద్వారా ఇవి పని చేస్తాయని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలోని విద్యుత్తులో 4% సౌర ఫలకాల నుంచి ఉత్పత్తి అవుతోంది. ఫ్యూచర్ లో స్పేస్ సోలార్ పవర్ స్టేషన్స్ ఏర్పాటు అయితే సోలార్ పవర్ ఉత్పత్తి చాలా రెట్లు పెరుగుతుంది. 2028 నాటికి అంతరిక్షంలో సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించాలని చైనా యోచిస్తోంది. ఇందుకోసం భూమికి  400 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపగ్రహాన్ని మోహరించనున్నట్లు సమాచారం. ఈ ఉపగ్రహం సౌర శక్తిని విద్యుత్‌గా మార్చి భూమికి పంపుతుంది.