Rapid Train Features : ఫస్ట్ ర్యాపిడ్ ట్రైన్ ప్రారంభమైంది.. స్పెషాలిటీస్ ఇవీ

Rapid Train Features : దేశంలోనే తొలి ర్యాపిడ్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ప్రారంభించబోతున్నారు.

  • Written By:
  • Updated On - October 20, 2023 / 12:08 PM IST

Rapid Train Features : దేశంలోనే తొలి ర్యాపిడ్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ఉదయం ఉత్తర ప్రదేశ్ లోని సాహిబాబాద్ లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ పరిధిలోని 17 కిలోమీటర్ల ఏరియాలో రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (RRTS) విస్తరించి ఉంది. సాహిబాబాద్ నుంచి దుహై డిపో మధ్య ఉన్న ఐదు రైల్వే స్టేషన్ల మీదుగా తొలి ర్యాపిడ్ రైలు పరుగులు తీయనుంది. ఈ రైలు రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తుంది. వాస్తవానికి ఢిల్లీ, ఘజియాబాద్, మీరట్ రూట్ లో పనులు ఇంకా పూర్తి కాలేదు. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తొలి విడతలో ఒకదాని తర్వాత ఒకటిగా అందుబాటులోకి వచ్చే ర్యాపిడ్ రైళ్లు ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లోని సిటీలు, పట్టణాలను (Rapid Train Features)  కలుపుతాయి.

We’re now on WhatsApp. Click to Join.

ర్యాపిడ్ రైలు ప్రత్యేకతలు ఏమిటి ? 

  • ర్యాపిడ్‌ రైలు పూర్తి ఎయిర్‌ కండిషన్డ్‌గా ఉంటుంది.
  • ప్రతీ ర్యాపిడ్ రైలులో 6 బోగీలు ఉంటాయి. వాటిలో 1200 మంది ప్రయాణించవచ్చు. ఈ ఆరు కోచ్ లలో ఒకటి ప్రీమియం కోచ్‌.
  • ఇందులో ఒక కోచ్‌ను మహిళల కోసం రిజర్వు చేశారు. ఇది ప్రీమియం కోచ్ పక్కనే ఉంటుంది.
  • అన్ని కోచ్‌లలో మహిళలు, ముసలివారు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సీట్లు ఉంటాయి.
  • ర్యాపిడ్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి.
  • ర్యాపిడ్ రైలు సాధారణ కోచ్‌ లలో కనీస టికెట్‌ ధర 20 రూపాయలు కాగా గరిష్ఠ టికెట్ ధర రూ.50.
  • ప్రీమియం క్లాస్ కోచ్‌లలో కనీస టికెట్‌ ధర 40 రూపాయలు కాగా.. గరిష్ఠ ధర 100 రూపాయలుగా నిర్ణయించారు.
  • ర్యాపిడ్ రైళ్ల వ్యవస్థను  RRTSను ర్యాపిడ్ ఎక్స్‌ అని కూడా పిలుస్తారు.
  • ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల భాగస్వామ్యంతో ర్యాపిడ్ రైళ్ల వ్యవస్థను డెవలప్ చేస్తున్నారు.
  •  ర్యాపిడ్ రైళ్ల కారిడార్ పనులన్నీ పూర్తయ్యాక .. ప్రతి 15 నిమిషాలకు ఒక ర్యాపిడ్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల రద్దీని బట్టి రైళ్ల సంఖ్యను పెంచుతారు.
  • ఢిల్లీలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కూడా ఈ ట్రైన్ వ్యవస్థ ప్రధాన లక్ష్యం.

Also Read: Rahul Gandhi – Kodandaram : రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్ కీలక ప్రకటన