Historical Churches : క్రిస్మస్ వేళ చారిత్రక చర్చిల విశేషాలివీ..

Historical Churches : డిసెంబరు 25న జరిగే క్రిస్మస్ వేడుకల కోసం దేశవ్యాప్తంగా చర్చిలు ముస్తాబవుతున్నాయి.

  • Written By:
  • Publish Date - December 2, 2023 / 08:29 AM IST

Historical Churches : డిసెంబరు 25న జరిగే క్రిస్మస్ వేడుకల కోసం దేశవ్యాప్తంగా చర్చిలు ముస్తాబవుతున్నాయి. ఈ తరుణంలో కొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్లి చారిత్రక చర్చిలలో పండుగ వేడుకలు చేసుకుంటారు. ఈరోజు మనం అలాంటి చారిత్రక చర్చిల గురించి తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join.

మెదక్ కేథడ్రల్ 

మెదక్ కేథడ్రల్ చర్చి చాలా ఫేమస్. దీన్ని రివరెండ్ చార్లెస్ వాకర్ ఫాస్నెట్ నిర్మించారు. 1895లో సికింద్రాబాద్‌లోని బ్రిటిష్ ఆర్మీకి మినిస్టర్‌గా వచ్చిన చార్లెస్ ఒకసారి మెదక్ పర్యటనకు వెళ్లగా.. అక్కడ కొంతమంది క్రిస్టియన్లు గుర్తించారు. ఆ తర్వాత అక్కడ ఉంటూనే వారి ప్రార్థనల కోసం చర్చి నిర్మాణాన్ని తలపెట్టారు. 1914లో నిర్మాణ పనులు ప్రారంభించగా.. 1924లో వర్క్స్ పూర్తయ్యాయి. ఈ చర్చి నిర్మాణ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా మెదక్‌లో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో చార్లెస్ ‘పనికి ఆహారం పథకం’ని ప్రవేశపెట్టి చర్చి నిర్మాణంలో పాలుపంచుకున్నవారికి భోజన ఏర్పాట్లు చేశారు. 1924 డిసెంబర్ 25న ఈ చర్చిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో అది ఆసియాలోనే అతిపెద్ద డియోసెస్ కలిగిన చర్చిగా వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చర్చిగా ప్రత్యేకతలు సాధించింది. ఇందులో  175 అడుగుల ఎత్తులో ఉండే బెల్ టవర్ కూడా ఉంటుంది. మొత్తం 300 ఎకరాల్లో విస్తరించిన ఈ చర్చి సముదాయం అందంగా ఉంటుంది. 100 ఫీట్ల వెడల్పు, 200 ఫీట్ల పొడవు కలిగిన కేథడ్రల్ టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఏటా 30 లక్షల మంది పర్యాటకులు ఈ చర్చిని చూడటానికి వస్తుంటారు.

  • బసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చి 

గోవాలోని బసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చి ప్రపంచం నలుమూలల నుంచి క్రైస్తవ పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది సుమారు 400 సంవత్సరాల నాటిది.

  • ది అవర్ లేడీ ఆఫ్ ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్

ది అవర్ లేడీ ఆఫ్ ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్  చర్చి గోవాలోని పనాజీలో ఉంది. దీన్ని తొలుత 1541లో నిర్మించారు. అనంతరం 1600-1609 మధ్య ఈ చర్చి అందమైన ఆకృతిని పొందింది. ఈ చర్చిలోని ప్రధాన మందిరాన్ని మేరీ మాతకు అంకితం చేశారు. ఇందులో సెయింట్ పీటర్, సెయింట్ పాల్ విగ్రహాలు ఉన్నాయి.

  • సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి

సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి… భారతదేశంలోని మొదటి యూరోపియన్ చర్చి ఇది. దీన్ని 1503లో కేరళలోని కొచ్చిలో నిర్మించారు. వాస్కోడిగామాను ఇక్కడే ఖననం చేశారని అంటారు.

  • సెయింట్ మేరీస్ బసిలికా 

కర్ణాటక రాజధాని బెంగళూరులో సెయింట్ మేరీస్ బసిలికా చర్చి ఉంది. ఏటా ఇక్కడ జరిగే సెయింట్ మేరీస్ ఫెస్ట్‌ చాలా ఫేమస్.

  • సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్ 

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో కేథడ్రల్ ఆఫ్ ది సేక్రేడ్ హార్ట్ చర్చి ఉంది.  ఈ రోమన్ క్యాథలిక్ చర్చి 14 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్ హెన్రీ మేడ్ దీన్ని తీర్చిదిద్దారు. చర్చి పైకప్పు, అందమైన తోరణాలు, లోపల డిజైన్లు మనల్ని చూపు(Historical Churches) తిప్పుకోనివ్వవు.

Also Read: Whats Today : కృష్ణా జలాల పంచాయితీపై ఢిల్లీలో సమావేశం.. 215వ రోజుకు లోకేష్‌ పాదయాత్ర