Laden Vs Nuclear Weapons : పాకిస్తాన్ ఆర్మీకి, ఉగ్రవాదులకు.. పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఉగ్రవాదులకు బలమైన లింకులు ఉన్నాయి. ఇదే నిజం. దీనికి బలమైన ఆధారంగా నిలిచే పచ్చి నిజాలను మనం తెలుసుకోబోతున్నాం. ఏకంగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌తో లింకులు పెట్టుకున్న పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం.. అతడు ఏకంగా అణుబాంబు తయారీ ఫార్ములాను లాడెన్‌కు ఫ్రీగా ఇద్దామని అనుకున్నాడు. పాకిస్తాన్‌కు నమ్మక ద్రోహం చేయాలని భావించిన ఆ శాస్త్రవేత్త పుత్రరత్నం ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీలో పెద్ద హోదాలో ఉన్నాడు. వివరాలివీ..
Also Read :PM Modi Warning : ‘‘పాక్ కాల్పులు జరిపినా.. మేం దాడి చేస్తాం’’.. ప్రధాని మోడీ వార్నింగ్
సుల్తాన్ బషీరుద్దీన్.. తొలుత సైంటిస్టు.. తర్వాత ఉగ్రవాది
ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్‌గా అహ్మద్ షరీఫ్ చౌదరి సేవలు అందిస్తున్నారు. ఇటీవలే భారత్ – పాక్ సైనిక ఘర్షణలు జరిగిన టైంలో పాకిస్తాన్ ఆర్మీ తరఫున ఈయనే మీడియాకు అప్‌డేట్స్‌ను వివరించారు. అహ్మద్ షరీఫ్ చౌదరి తండ్రి పేరు సుల్తాన్ బషీరుద్దీన్ మహమూద్. సుల్తాన్ బషీరుద్దీన్ ఒక అణు శాస్త్రవేత్త. పాకిస్తాన్ అణుబాంబు తయారీ కార్యక్రమంలో అబ్దుల్ ఖదీర్ ఖాన్‌తో పాటు సుల్తాన్ బషీరుద్దీన్ కీలక పాత్ర పోషించారు. పాకిస్తాన్ అణుబాంబు తయారీలో పాల్గొన్న ఈ ఇద్దరు శాస్త్రవేత్తలపై అప్పట్లో అమెరికా నిఘా సంస్థలు ఒక కన్నేసి పెట్టాయి. అమెరికా నిఘా టీమ్‌లు ఒక కీలక విషయాన్ని గుర్తించాయి. సుల్తాన్ బషీరుద్దీన్ మహమూద్ ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లి మరీ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను కలిసినట్టుగా అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో అప్పట్లో అమెరికా తీవ్ర ఆందోళనకు గురైంది. సుల్తాన్ బషీరుద్దీన్ చిట్టాను అమెరికా వెలికి తీయగా.. అతడు అల్ ఖైదాకు, తాలిబన్లకు ఆయుధాలను, పేలుడు సామగ్రిని సప్లై చేసేవాడని వెల్లడైంది. అల్ ఖైదాకు అణుబాంబు తయారీ ఫార్ములాను అందించే అంశంపైనా లాడెన్(Laden Vs Nuclear Weapons)తో సుల్తాన్ బషీరుద్దీన్ చర్చలు జరిపారని అమెరికా గుర్తించింది. దీనిపై వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వానికి అమెరికా సమాచారాన్ని అందజేసింది.
అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించినా.. వదిలేసిన పాక్
2010 సంవత్సరంలో సుల్తాన్ బషీరుద్దీన్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్టు చేసిందనే వార్తలు వచ్చాయి. మరోవైపు సుల్తాన్ బషీరుద్దీన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. 2001 డిసెంబర్ 24న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ సైతం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. ఒసామా బిన్ లాడెన్, తాలిబన్లతో సంబంధం ఉన్నందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కట్ చేస్తే.. ఇప్పుడు సుల్తాన్ బషీరుద్దీన్ మహ్మూద్ పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లోనే హ్యాపీగా జీవిస్తున్నాడు. ఆయన కుమారుడు అహ్మద్ షరీఫ్ చౌదరికి పాకిస్తాన్ ప్రభుత్వం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్‌గా కీలక పోస్టింగ్‌ను కేటాయించింది. ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్‌కు ఆప్త మిత్రుడు. అతడు పాక్‌లోని అబోటాబాద్‌లో ఉండగా.. అమెరికా ఆర్మీ కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించి లాడెన్‌ను అంతం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం తరఫున చర్చలు జరపడానికే లాడెన్‌ను సుల్తాన్ బషీరుద్దీన్ కలిశాడా ? పాకిస్తాన్ సైన్యమే అణుబాంబు ఫార్ములాను లాడెన్‌కు అమ్మేందుకు యత్నించిందా ? అందుకే ఇప్పుడు సుల్తాన్ బషీరుద్దీన్‌ను శిక్షించకుండా వదిలేసిందా ? సుల్తాన్ బషీరుద్దీన్ కొడుకుకు కీలక పదవి ఇచ్చింది అందుకేనా ? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వీటికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, గూఢచార సంస్థ ఐఎస్ఐ అధినేత, పాక్ ప్రధానమంత్రి మాత్రమే సమాధానం చెప్పగలుగుతారు.