Site icon HashtagU Telugu

Old Age Homes: కన్న దల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో వదిలేస్తున్న కొడుకులు

Old Age Homes

Old Age Homes

Old Age Homes: పూర్వీకుల పేరిట తర్పణం, శ్రాద్ధం, దానధర్మాలు చేయడం అనేది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. ప్రస్తుత రోజుల్లో కన్న తల్లిదండ్రుల్ని వదిలేస్తున్న పిల్లలు ఎందరో ఉన్నారు. బ్రతికుండగానే పిండాలు పెట్టేస్తున్నారు. ఇతరులకు సాయం దేవుడెరుగు, తల్లిదండ్రులకు కనీస తిండి పెట్టడం లేదు. పైగా అనాదశరణాలయంలో చేరుస్తున్నారు. దీంతో కుటుంబం ఉన్నప్పటికీ వృద్ధాశ్రమంలో గడపాల్సి వస్తోంది. ఇలా వృద్ధాశ్రమంలో ఎంతో మంది వృద్ధులు అనాధలుగా మారిపోతున్నారు.

రామ్ లాల్ వృధాశ్రమంలోని వ్యక్తి మాట్లాడుతూ.. నాకు ముగ్గురు కొడుకులు. ఇద్దరు కొడుకుల కోసం షూ ఫ్యాక్టరీని ప్రారంభించాను. పెళ్లి అయ్యాక ఆస్తుల్ని ఇద్దరికీ సరిసమానంగా పంచాను. అయితే కొన్నాళ్ళకు నా కొడుకులు నన్ను, నా భార్యను కూడా పంచుకున్నారు. నా భార్యను పెద్ద కొడుకు వద్ద ,నన్ను మధ్య కొడుకు వద్ద వదిలిపెట్టారు. అతను తన భార్య నుండి విడిపోయి 7 సంవత్సరాలకు పైగా అయింది. దీంతో నాకు తినడానికి తిండి కూడా పెట్టడం లేదు. అందుకే నేనే ఆశ్రమానికి వచ్చాను అని బాధను వెళ్లబోసుకున్నారు. .

సీమా దేవి మాట్లాడుతూ … మా పరిస్థితి గురించి ఎవరూ అడగరు. భర్త డాక్టర్ కావడంతో కొడుకును కూడా డాక్టర్‌ని చేయాలని కలలు కన్నాను. భర్త చనిపోయాక కొడుకు డాక్టర్ అయి నన్ను ఇంట్లో ఉంచడానికి నిరాకరించాడు. దాని కారణంగా నేను ఆశ్రమంలో నివసించాల్సి వచ్చింది.

రేఖాదేవి తన పిల్లల సంక్షేమం కోసం ఏమీ చేయలేదన్నారు. పిల్లలు పెద్దయ్యాక కూతుళ్లకు పెళ్లిళ్లు చేశారు. దీని తర్వాత ఏం జరిగిందో కూడా ఊహించలేదు. కొడుకు కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె ఆశ్రమానికి వచ్చింది. అమ్రాను కలవడానికి కూడా ఎవరూ ఇక్కడికి రారు. ఇలా ఎందరో వృద్దులు పిల్లల ప్రేమకు దూరమై అనాధలుగా బ్రతుకుతున్నారు.

Also Read: Gold Price: మగువలకు శుభవార్త: బంగారం ధరలు పతనం

Exit mobile version