Site icon HashtagU Telugu

Gandhi Jayanti 2023 : మహాత్మా.. నీ బాటలో నడిచే బలమివ్వు

Mahatma Gandhi 1947 August 15th

Mahatma Gandhi 1947 August 15th

Gandhi Jayanti 2023 : ఇవాళ (అక్టోబ‌ర్ 2) గాంధీజ‌యంతి. భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పాత్ర‌ను స్మ‌రించుకోవాల్సిన రోజు ఇది. శాంతి, సహనం, సత్యం, అహింసా మార్గాన్ని అనుసరిస్తే కష్టతరమైన పోరాటాల్లోనూ విజయం సాధించవచ్చని నిరూపించిన మహనీయుడు మ‌హాత్మ‌గాంధీ. దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి భారతావనికి స్వాతంత్ర్యాన్ని అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రతి ఒక్కరిలో రగిల్చేందుకు దేశంలో అనేక ప్రాంతాల్లో పర్యటించారు. గాంధీజీ మాటలు (Gandhi Jayanti 2023)  భారతదేశ ప్రజలపైనే కాదు.. విదేశీయులపై కూడా ఎంతో ప్రభావం చూపించాయి.

Also read : Hyderabad: మిలాద్ ఉన్ నబీ ఊరేగింపులో 100 ఫోన్లు మాయం

గాంధీజీ గురించి ఆసక్తికర విషయాలు..

  • గాంధీజీ ఐరిష్​ యాక్సెంట్​లో ఇంగ్లీష్ మాట్లాడేవారు. ఆయన మొదటి ఇంగ్లీష్​ టీచర్​ ఓ ఐరిష్​ వ్యక్తి కావడంతో గాంధీజీకి కూడా అదే యాక్సెంట్​ వచ్చింది.
  • గాంధీజీ సౌతాఫ్రికాలో ఉండగా  ఏడాదికి  15000 డాలర్లు (ఇప్పటి కరెన్సీ విలువ రూ.12 లక్షలు) సంపాదించేవారు. ఇంత భారీ సంపాదనను వదులుకుని ఇండియాకు తిరిగొచ్చారు.
  • మహాత్మా గాంధీ రాసిన ఆటోబయోగ్రఫీ ‘‘మై ఎక్స్​పరిమెంట్స్​ విత్​ ట్రూత్​’’ 1927లో పబ్లిష్ అయింది. 20వ శతాబ్దాంలో 100 మోస్ట్​ ఇంపార్టెంట్​ పుస్తకాల్లో ఇదొకటి.
  • గాంధీజీ పుట్టింది శుక్రవారం నాడు. ఆయన మరణించింది శుక్రవారం నాడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కూడా శుక్రవారమే!
  • గాంధీజీకి “మహాత్మా”  అనే బిరుదును రవీంద్రనాథ్​ ఠాగూర్​ ఇచ్చారు. ఓసారి ఠాగూర్​ను కలిసిన గాంధీజీ.. ‘నమస్తే గురుదేవ్​’ అని సంబోధించారు. అందుకు బదులుగా..  ‘‘నేను గురుదేవ్​ అయితే మీరు మహాత్ముడు’’ అని ఠాగూర్ అన్నారు.
  • 1930లో మహాత్మా గాంధీని  ‘మ్యాన్​ ఆఫ్​ ది ఇయర్​’గా టైమ్​ మ్యాగజైన్ ఎంపిక చేసింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు గాంధీజీయే.

గాంధీజీ చెప్పిన గొప్ప సూక్తులు.. 

  • మానవుల ఆవేశాలు వేగంగా పరుగెత్తుతాయి.. వీటిని అదుపులో పెట్టడానికి కొండంత సహనం కావాలి.
  • నా విశ్వాసాల్లో అహింసా మార్గమే మెుట్టమెుదటి ఆర్టికల్.. నా మతంలోనూ అదే చివరి ఆర్టికల్.
  • తప్పులు చేసే స్వేచ్ఛ లేనప్పుడు ఆ స్వేచ్ఛకు అంత విలువ ఉండదు..
  • రేపే మీ చివరి రోజు అన్నట్టుగా జీవించాలి. అయితే రేపు కూడా జీవించాలన్న దృక్పథంతో నిరంతరం నేర్చుకోవాలి.
  • కన్నుకు కన్ను అనే సిద్ధాంతం.. ప్రపంచాన్నే గుడ్డిగా మారుస్తుంది.
  • పాపాన్ని ద్వేషించండి.. పాపిని ప్రేమించండి.
  • దేవుడికి మతం అనేది లేదు.. మతంతో సంబంధమే లేదు.
  • అహింసకు మించిన ఆయుధం లేదు..
  • ఓటు, సత్యాగ్రహం ఈ రెండూ ప్రజల చేతిలో ఆయుధాలు..
  • తృప్తి అనేది ప్రయత్నంలో తప్ప, విజయం ద్వారా లభించదు. పూర్తి ప్రయత్నమే నిజమైన విజయం.