September New Rules : మరో రెండు రోజుల్లో సెప్టెంబరు నెల మొదలుకాబోతోంది. రాబోయే నెలలో మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే మన నిత్య జీవితంతో ముడిపడిన కొన్ని అంశాలకు సెప్టెంబరు నెలలో కొత్త మార్పులు జరగబోతున్నాయి. ఇంతకీ అవేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- మీరు క్రెడిట్ కార్డులు వాడుతున్నారా ? అయితే అలర్ట్ కండి. థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసే ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపులపై సెప్టెంబరు 1 నుంచి రివార్డు పాయింట్లను ఇచ్చేది లేదని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రకటించింది. యుటిలిటీ లావాదేవీలపై పొందే రివార్డ్ పాయింట్లపై కూడా సెప్టెంబర్ 1 నుంచి లిమిట్ విధించింది.
- ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ క్రెడిట్ కార్డు బిల్లుల మొత్తంపై చెల్లించే మినిమమ్ బ్యాలెన్స్‌ను సెప్టెంబరు 1 నుంచి తగ్గిస్తామని ప్రకటించింది. చెల్లింపు గడువును 18 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించింది.
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో కీలక ప్రకటన చేయనుంది. ఉద్యోగులకు డీఏను 3 శాతం పెంచే ఛాన్స్ ఉంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 53 శాతానికి చేరనుంది.
Also Read :Kashmir : కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్లు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
- ఆధార్ కార్డులో(September New Rules) మీరు ఏదైనా అప్‌డేట్ ఫ్రీగా చేసుకోవాలా ? అయితే త్వరపడండి. ఇందుకు లాస్ట్ డేట్ సెప్టెంబర్ 14. ఆ తర్వాత ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- మోసపూరిత కాల్స్, మెసేజ్‌లను పంపే టెలీ మార్కెటర్లను కట్టడి చేయాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారులను మోసపూరిత కాల్స్, మెసేజ్‌లు పోకుండా అడ్డుకోవాలని నిర్దేశించింది. 140 సిరీస్‌తో మొదలయ్యే ఫోన్ నంబర్ల నుంచి టెలిమార్కెటింగ్ కాల్స్, మెసేజ్‌లు వెళ్లకుండా సెప్టెంబర్ 30కల్లా చర్యలు తీసుకోవాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది.