Nayanthara Birthday : ఇవాళ ప్రముఖ హీరోయిన్ నయనతార పుట్టినరోజు. ఆమె 1984 నవంబరు 18న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఆమె పూర్వీకులు కేరళలోని తిరువల్లా ప్రాంత మళయాలీ సిరియన్ క్రైస్తవ మతానికి చెందినవారు. నయనతార తల్లిదండ్రుల పేర్లు.. కురియన్ కొడియత్తు, ఒమానా కురియన్. నయనతార వాళ్ల నాన్న అప్పట్లో భారత వాయుసేనలో అధికారిగా పనిచేసేవారు. అందువల్ల ఆయనకు పదేపదే ట్రాన్స్‌ఫర్లు జరిగేవి. ఈకారణం వల్ల మనదేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నయనతార చదువుకోవాల్సి వచ్చింది. ఆమె ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ కోర్సు చేశారు.
Also Read :Nuclear Weapons : భారీగా అణ్వాయుధాలు రెడీ చేయండి.. కిమ్ సంచలన ఆర్డర్స్
నయనతారకు ఆ పేరు పెట్టిందెవరు ? రెమ్యునరేషన్ ఎంత ?
- నయనతార అసలు పేరు.. డయానా మరియం కురియన్. సినిమా కెరీర్ మొదలుపెట్టాక.. ఆమె తొలుత ‘మనసీనక్కరే’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా దర్శకుడికి డయానా అనే పేరు నచ్చలేదు. దీంతో ఆయన ఒక రోజంతా ఆలోచించి డయానా మరియం కురియన్‌కు కొత్త పేరు పెట్టారు. అదే.. నయనతార!! ఈ పేరే ఆమెకు మూవీ ఇండస్ట్రీలో బాగా కలిసొచ్చింది. ఏకంగా స్టార్ హీరోయిన్‌గా అవకాశాలను సాధించి పెట్టింది.
- చంద్రముఖి సినిమాతో నయనతార(Nayanthara Birthday) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఆమె వరుస అవకాశాలు పొందారు.
- ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ల లిస్టులో ఆమె ముందున్నారు. నయనతార ఒక సినిమాకు 15 కోట్ల వరకూ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటారు.
- నయనతార ఒక ప్రైవేట్ ఫ్లైట్‌ను కూడా మెయింటైన్ చేస్తున్నారు. దీన్నిబట్టి ఎంతగా ఆస్తులు సంపాదించారో అంచనా వేయొచ్చు. చెన్నై, హైదరాబాద్, కేరళల్లో ఇళ్లు కొన్నారు. లగ్జరీ కార్లు ఉన్నాయి. సొంతంగా కొన్ని బిజినెస్‌లు సైతం నయనతార నడుపుతున్నారు.
Also Read :Secretariat Vastu : రూ.3 కోట్లతో తెలంగాణ సచివాలయంలో చేస్తున్న వాస్తు మార్పులివీ..
- నయనతార గతంలో హీరో శింబుతో ప్రేమలో పడ్డారు. అయితే వాళ్లు పెళ్లి చేసుకోలేదు. రెండోసారి స్టార్ కొరియోగ్రఫర్ ప్రభుదేవను ప్రేమించారు. ఆయనను కూడా నయనతార పెళ్లి చేసుకోలేకపోయారు. చివరకు యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను దాదాపు ఐదేళ్లు ఆమె ప్రేమించారు.అనంతరం ఆయనను పెళ్లి చేసుకున్నారు.
- ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు నయనతార సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘రక్కయీ’ (RAKKAYIE) అనే కొత్త సినిమాను ప్రకటించారు. సెంథిల్ దర్శకత్వంలో ఈ చిత్రం ఐదు భాషల్లో తెరకెక్కనుంది. ఈ వివరాలు తెలుపుతూ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో కూతరు కోసం యుద్ధం చేసే శక్తిమంతమైన తల్లిపాత్రలో ఆమె కనిపించనున్నారు.