Site icon HashtagU Telugu

National Tourism Day 2024 : మనదేశంలో బెస్ట్ చూడదగ్గ ప్రదేశాలు ఇవే

National Tourism Day 2024

National Tourism Day 2024

National Tourism Day 2024: ప్రస్తుతం మనిషి జీవితం ఉరుకుల పరుగుల గమనంగా మారింది. ఉద‌యాన్నే లేవ‌డం ఆఫీసుకు వెళ్ల‌డం, తిరిగి సాయంత్రం ఇంటికి రావ‌డం..కాస్త తినడం..ఫోన్ చూడడం నిద్ర పోవడం..మళ్లీ ఉదయాన్నే లేవడం..ఆఫీసుకు వెళ్లడం ఇదే అంద‌రి జీవితాల్లో ఉండే దిన‌చ‌ర్య‌. రోజు వారీ ఈ బిజి లైఫ్ నుంచి కాస్త ప్ర‌శాంత‌త కోసం చాలామంది ఎక్క‌డికైనా వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. కొత్త ప్ర‌దేశాల‌ను చూడ‌డం, కొత్త వారిని క‌ల‌వ‌డం, ప్ర‌యాణించ‌డం, జ్ఞాపకాలను సేకరించడం ఇలాంటివి చేసేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఎంత పెద్ద సెల‌బ్రిటీ అయినా, సామాన్యుడైనా ప్ర‌తిఒక్క‌రికీ విరామం కావాల్సిందే. ఎవ‌రికి తగ్గ స్థోమ‌త‌లో ఆ విరామ స‌మయంలో వారికి న‌చ్చిన ప్ర‌దేశాల‌ను చుట్టేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. కాస్త డబ్బున్న వ్యక్తులు ఇతర దేశాలకు వెళ్లి అక్కడ చూడదగ్గ ప్రదేశాలను చుట్టేసి వస్తారు..మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారు మన దేశంలోనే చూడదగ్గ ప్రదేశాలను చూసి ఎంజాయ్ చేసి వస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు (జనవరి 25) జాతీయ పర్యాటక దినోత్సవం (National Tourism Day 2024 ) సందర్బంగా మన దేశంలో బెస్ట్ పర్యాటక ప్రదేశాలు ఏంటో మీకు చెప్పబోతున్నాం. అసలు జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా..? ఇది ప్రయాణ స్ఫూర్తిని తెలియజేస్తుంది. ఈ రోజు ప్రజలను వారి స్వంత దేశాలలో ఉన్న అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించమని ప్రోత్సహించడమే కాకుండా, అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. ఒక దేశంలో ఉన్న సాంస్కృతిక, చారిత్రక, సహజ అద్భుతాలను కొనియాడాలని, ఇతర దేశాల భౌగోళిక, సంస్కృతిక అద్భుతాలను గౌరవించాలని జాతీయ పర్యాటక దినోత్సవం నిర్వహిస్తారు.

ప్రస్తుతం పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతూ వ‌స్తోంది. ఎన్నో అంద‌మైన ప్ర‌దేశాలు, చారిత్రాత్మ‌క నిర్మాణాలు పర్యాటకులను ఎంత‌గానో ఆకట్టుకుంటున్నాయి. ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు కొన్ని టూరిజం ఆర్గ‌నైజేష‌న్స్ వివిధ ర‌కాల పోటీల‌ను కూడా నిర్వ‌హిస్తున్నాయి. అందువల్లే అభివృద్ధి చెందుతున్న దేశాలకు టూరిజం ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతోంది. మన దేశం లో కూడా ఎన్నో అందమైన ప్రదేశాలు..అందర్నీ కట్టిపడేస్తుంటాయి.

మన దేశంలో చూడదగ్గ ప్రదేశాలు :

Taj Mahal

Jaipur, Rajasthan

Varanasi, Uttar Pradesh

Kerala Backwaters

Goa

Lahaul & Spiti, Himachal Pradesh

Cherrapunji, Meghalaya

Mysore, Karnataka

Leh-Ladakh

Ajanta and Ellora Caves, Maharashtra

Hyderabad

Vizag

 

ఇవే కాక ఇంకా మన దేశంలో చాల చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి..వీటిలో కొన్ని వర్షాకాలంలో మాత్రమే చూడాల్సిన ప్రదేశాలు , చలికాలంలో చూడదగ్గ ప్రదేశాలు, ఎండాకాలంలో చూడాల్సిన ప్రదేశాలు ఇలా కాలానికి అనుగుణంగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళ్లాలనుకుంటే సెర్చ్ లో వెళ్ళండి.

Read Also : Republic Day: గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిని ఎలా ఎంపిక చేస్తారు..?