Site icon HashtagU Telugu

Hyderabad: అమరవీరుల త్యాగాలు.. సజీవ చిత్రాలుగా!

Art1

Art1

ఒక్క ఫొటో వెయ్యి భావాలకు సమానం అంటారు. మాటల్లో చెప్పలేనిది ఆర్ట్ ద్వారా చెప్పొచ్చు అని నిరూపిస్తున్నారు మన హైదరాబాద్ ఆర్ట్స్ స్టూడెంట్స్.

ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) సికింద్రాబాద్ ప్రహరీ ప్రాంతాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ప్రాంతాల్లో వేసిన చిత్రాలను ప్రతిఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. వీరుల త్యాగాలు, అమర జవాన్ల యుద్ధ సన్నివేశాలు కళ్లకు కడుతున్నాయి. శత్రు దేశాలపై పోరాడిన జవాన్ల పోరాట ఘట్టాలు అక్కడ సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ (JNAFAU) విద్యార్థులు ఆర్మీ అధికారుల ఎంకరేజ్ మెంట్ తో అద్భుతమైన చిత్రాలు వేస్తున్నారు. 1947-1948 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం, ‘సెప్టెంబర్ 1948లో జరిగిన ఆపరేషన్ పోలో, నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాచరిక రాష్ట్రాన్ని భారత సాయుధ దళాలు ఆక్రమించిన సైనిక చర్య. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధంలో హిమాలయ సరిహద్దులోని మన సైనికులు ఆర్మీ జీప్‌ని లాగుతున్నట్లు అనాటి సన్నివేశాలు ఇక్కడ తిలకించవచ్చు.

Exit mobile version