Anant Ambani : రేపు (జులై 12న) పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ వేడుకకు ముంబై నగరంలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలువబోతోంది. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్దసంఖ్యలో హాజరుకానున్నారు. వీఐపీలు, సెలబ్రిటీల తాకిడి ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లోనూ తారలు తళుక్కుమన్నారు. జులై 14న ముంబైలోనే గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది.
We’re now on WhatsApp. Click to Join
- అనంత్ అంబానీ(Anant Ambani) వయసు 29 ఏళ్లు.
- అనంత్ అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీని పొందారు.
- ప్రస్తుతం అనంత్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రీన్ ఎనర్జీ విస్తరణ విభాగాన్ని నడుపుతున్నారు.
- గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వన్ తార పేరుతో జంతు సంరక్షణ కేంద్రాన్ని కూడా అనంత్ నిర్వహిస్తున్నారు.
- 2017లో పరస్పర స్నేహితుల ద్వారా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌లకు పరిచయం ఏర్పడింది.
- 29 ఏళ్ల వధువు రాధికా మర్చంట్(Radhika Merchant) ఫ్యామిలీకి కూడా వ్యాపార నేపథ్యం ఉంది.
- రాధిక తండ్రి వీరేన్ మర్చంట్ ఫార్మాస్యూటికల్ వ్యాపారవేత్త.
- వీరేన్ మర్చంట్ కంపెనీ పేరు ఎన్‌కోర్ హెల్త్‌కేర్.
- ఎన్‌కోర్ హెల్త్ కేర్ కంపెనీలో మార్కెటింగ్ డైరెక్టర్‌గా వీరేన్ ఉన్నారు.
- రాధికా మర్చంట్ ముంబైలోని క్యాథెడ్రల్ అండ్ జాన్ కోనన్ స్కూల్, ఎకోలీ మోండియేల్ వరల్డ్ స్కూల్‌లలో చదువుకున్నారు.
- అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్, ఎకానమిక్స్‌లో రాధిక గ్రాడ్యుయేషన్ చేశారు.
- కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే దేశాయ్ అండ్ దేవాన్ జీ, ఇండియా ఫస్ట్ లాంటి సంస్థల్లో రాధిక పనిచేశారు.
- గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక లగ్జరీ ఇళ్లు నిర్మించే రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఐఎస్ ప్రవాలో రాధిక ఉద్యోగం చేశారు.
- క్లాసికల్ డ్యాన్సులో రాధికా మర్చంట్ ట్రైనింగ్ పొందారు. ముంబైలోనే భరత నాట్యంలో ఎనిమిదేళ్లు ట్రైనింగ్ తీసుకున్నారు.
- రాధికా మర్చంట్ తల్లిపేరు శైలా మర్చంట్. ఆమె యానిమల్ వెల్ఫేర్ వంటి విభాగాల్లోనూ చాలా సేవలు అందిస్తున్నారు.
- రాధికా మర్చంట్ తండ్రి వీరేన్ మర్చంట్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, ఒక స్టీల్ కంపెనీ బోర్డులలోనూ సభ్యులుగా ఉన్నారు.