Site icon HashtagU Telugu

Hamas Mastermind : ఇజ్రాయెల్ పై ఉగ్రదాడుల సూత్రధారి ఇతడే!

Hamas Mastermind

Hamas Mastermind

Hamas Mastermind : అక్టోబరు 7న (శనివారం) తెల్లవారుజామున ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై హమాస్ ఉగ్రవాదులు జరిపిన రాకెట్ దాడులు యావత్ ప్రపంచంలో కలకలం క్రియేట్ చేశాయి. ఈ దాడుల్లో ఎన్నడూ లేని తరహాలో ఇజ్రాయెలీ పౌరులు చనిపోయారు. ఈ ఆపరేషన్ కు హమాస్ ‘అల్ అక్సా ఫ్లడ్’ అని పేరు పెట్టింది. రక్తపాతాన్ని క్రియేట్ చేసిన ఈ ఆపరేషన్ కు మాస్టర్ మైండ్ ఎవరు ? అనేది వెలుగులోకి వచ్చింది. అతడి పేరే మహమ్మద్ దెయిఫ్. ఇజ్రాయెల్ పై రాకెట్ దాడి చేయడం.. ఆ వెంటనే పారాచూట్ల సాయంతో సరిహద్దులు దాటి ఇజ్రాయెలీ భూభాగంలోకి అడుగుపెట్టడం అనే స్కెచ్ వేసింది ఇతనే. ఈ ఆపరేషన్‌ కు అల్ అక్సా ఫ్లడ్ అనే పేరు పెట్టింది కూడా మహమ్మద్ దెయిఫే అని అంటున్నారు. దీనిపై ఇజ్రాయెల్ నిఘా సంస్థలకు ముందే సమాచారం అందినా.. పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

2014లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మహమ్మద్ దెయిఫ్ భార్య, 7 నెలల కుమారుడు, 3 సంవత్సరాల కుమార్తె చనిపోయారు. నాటి నుంచి అతడు ఇజ్రాయెల్ పై పగను పెంచుకున్నాడు.  అప్పటి నుంచి హమాస్ ఉగ్ర యాక్టివిటీలో అతడు చురుగ్గా పాల్గొంటున్నాడు. 2021లో జెరూసలేంలోని అల్ అక్సా మసీదుపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు జరిపిన టైంలో మహమ్మద్ దెయిఫ్ కొంచెంలో తప్పించుకొని పారిపోయాడు. ఈక్రమంలో అతడు ఒక కన్ను కోల్పోయాడని, ఒక కాలికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై రాకెట్ల దాడి తర్వాత మహమ్మద్ దెయిఫ్ విడుదల చేసిన వీడియోలో.. ముసుగు ధరించి కనిపించాడు. అతని నీడ మాత్రమే వీడియోలో కనిపించింది. భద్రతా కారణాల రీత్యా దెయిఫ్ స్మార్ట్ ఫోన్‌ల వంటి ఆధునిక డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడని అంటున్నారు.  ప్రస్తుతం మహమ్మద్ దెయిఫ్ ఎక్కడున్నాడు ? అనేది సస్పెన్స్ గా మారింది. గాజాలోనే ఎక్కడో ఓ టన్నెల్‌లో అతడు దాక్కుని ఉండొచ్చని (Hamas Mastermind)  అనుమానిస్తున్నారు.

Also read : Telangana: తెలంగాణాలో బీజేపీ గాలి వీస్తుంది: బండి