ఏపీ రాజకీయాల్లో (AP Politics) తమ్ముడు పవన్ కళ్యాణ్ రికార్డ్స్ (Pawan Kalyan Records) నెలకొల్పుతుంటే..ఇక్క చిత్రసీమ(Film Industry)లో అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) రికార్డ్స్ మీద రికార్డ్స్ తిరగరాస్తూ ఇద్దరు ఇద్దరే అని అంత మాట్లాడుకునేలా చేస్తున్నారు. చిత్రసీమలో చిరంజీవి మకుటం లేని మహారాజు అనే సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి..ఈరోజుకు టాప్ హీరోగా చెలామణి అవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కొణిదెల శివ శంకర వరప్రసాద్ (చిరంజీవి)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఎంతో ఆసక్తి. ఆ ఆసక్తితో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు ‘పునాదిరాళ్లు’ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత వెనక్కితిరిగి చూసుకోకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డాన్సుల్లో , డైలాగ్స్ లో , ఫైట్స్ లో , యాక్టింగ్ లో ఇలా అన్నింట్లో తనకు తానే సాటి అని నిరూపించుకుంటూ ఎన్నో రికార్డ్స్ , అవార్డ్స్ , రివార్డ్స్ దక్కించుకొని నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
చిరంజీవిని ఆదర్శంగా చేసుకొని ఎంతో మంది చిత్రసీమలో అడుగుపెట్టి ఈరోజు అగ్ర హీరోలుగా , డైరెక్టర్లు గా రాణిస్తూ ఉన్నారు. ఇక చిరంజీవి ఫ్యామిలీ నుండి సైతం ఎంతోమంది చిత్రసీమలో అడుగుపెట్టి హీరోలుగా , నిర్మాతలుగా రాణిస్తున్నారు. అలాంటి చిరంజీవిని 2006లో అప్పటి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. అదే ఏడాది ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ని కూడా అందుకున్నారు. 2016లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. ఇక 2022లో భారత ప్రభుత్వం నుంచి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కూడా దక్కింది. 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభుషణ్ అవార్డుతో సత్కరించింది. ఇక ఇప్పుడు వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు ((Guinness World Record)) దక్కింది. మెగాస్టార్ చిరంజీవి 46 సంవత్సరాల కాలంలో 156 సినిమాల్లో 537 పాటల్లో 24000 డ్యాన్స్ చేసినందుకు గాను వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కింది. ఆదివారం హైదరాబాద్ లో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు దక్కడంతో మెగా అభిమానులు , సినీ ప్రముఖులే కాదు రాజకీయ నేతలు సైతం అభినందనలు తెలియజేస్తూ తమ సంతోషాన్ని పంచుకుంటూ చిరంజీవి కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక అటు తమ్ముడ్ని చూస్తే..సినిమాల్లోనే (Movies) కాదు పాలనా లో కూడా తన మార్క్ చూపిస్తున్నారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). తాజాగా తాను తీసుకున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు (World Record) సృష్టించింది. ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణను (Gram Sabhas in 13,326 Villages in a Single Day) వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఈ రికార్డుకు సంబంధించిన పత్రాన్ని, మెడల్ ను ఆయనకు ప్రతినిధులు అందించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి పదేళ్లు దాటినా కానీ అధికారం అనేది దక్కలేదు. అయినప్పటికీ ఏమాత్రం నిరుత్సహం చెందకుండా ప్రజలకు సేవ చేస్తూ వచ్చాడు. తాను సంపాదించిందంతా ప్రజలకే ఇస్తూ..అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తో పొత్తు పెట్టుకొని సంచలన విజయం సాధించారు. జనసేన నుండి బరిలోకి దిగిన 21 ఎమ్మెల్యేలు , 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నారు. బాధ్యత తీసుకోవడమే ఆలస్యం తనదైన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ కనపరుస్తూ వస్తున్నారు.
ఇక పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ఆ శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ఒకే రోజు పెద్ద సంఖ్యలో గ్రామ సభలు నిర్వహించినందుకు గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డ్‌కు ఎక్కింది. ఏపీ వ్యాప్తంగా ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. ఒకే రోజు 13 వేల 326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించటాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. దీనికి సంబంధించిన రికార్డు పత్రాన్ని, పతకాన్ని యూనియన్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేశారు.
ఇలా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వేర్వేరు విభాగాల్లో ప్రపంచ రికార్డులు అందుకోవడం విశేషం. అక్కడ తమ్ముడు ప్రపంచ రికార్డు నెలకొల్పితే..ఇక్కడ అన్నయ్య గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పడని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
Read Also : Devara : ఉదయాన్నే ‘లాస్ ఏంజెలిస్’ కు బయలుదేరిన ఎన్టీఆర్