Anupam Mittal : అనుపమ్ మిట్టల్.. ఈయన షాదీ.కామ్ వ్యవస్థాపకుడు!! రెండు పదుల వయసులోనే ఈయన కోటీశ్వరుడు అయ్యాడు. ఫెరారీ కారు కోసం ఆర్డర్ ఇచ్చాడు. అయితే కొంతకాలం తర్వాత సీన్ రివర్స్ అయింది. డాట్ కామ్ బబుల్ వల్ల అనుపమ్ మిట్టల్‌కు వచ్చిన డబ్బంతా పోయింది. చివరకు అప్పులు చేయాల్సి వచ్చింది. తన కెరీర్ జర్నీ గురించి స్వయంగా అనుపమ్ మిట్టల్ లింక్డిన్ వేదికగా చెప్పుకొచ్చిన వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
‘‘నేను నా కెరీర్‌ను అమెరికాలో మొదలుపెట్టాను. ‘మైక్రో స్ట్రాటజీ’ అనే బిజినెస్ ఇంటెలీజెన్స్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేసేవాడిని. తొలినాళ్లలో నాకు భారీ విజయాలు దక్కాయి. బాగా డబ్బులు సంపాదించాను. నా టీమ్ చొరవతో ‘మైక్రో స్ట్రాటజీ’ కంపెనీ విలువ 40 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. రెండు పదుల ఏజ్‌లోనే నేను కోటీశ్వరుడిని అయ్యాను. అమెరికాలో జీవితం అందంగా కనిపించింది. ఫెరారీ కారు కోసం ఆర్డర్ ఇచ్చాను’’ అని అనుపమ్ మిట్టల్ తన కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు.
Also Read :UPI Circle : గూగుల్ పే ‘యూపీఐ సర్కిల్’.. ఒకే యూపీఐ ఐడీని ఐదుగురు వాడుకోవచ్చు
‘‘అంతా సజావుగా సాగుతోంది అనుకున్న తరుణంలో ఇబ్బందులు మొదలయ్యాయి. డాట్-కామ్ బబుల్ మొదలైంది. దీంతో నేను పనిచేసే ‘మైక్రో స్ట్రాటజీ’ కంపెనీ కూడా నష్టాల్లోకి వెళ్లింది. నాకు ఉన్న డబ్బంతా పోయింది. అన్నింటినీ కోల్పోయాను. అప్పులు చేయడం మొదలుపెట్టాను. 2003 నాటికి నేను ఆర్థికంగా వీక్ అయ్యాను’’ అని అనుపమ్ మిట్టల్ పాత రోజులను నెమరువేసుకున్నారు. ‘‘అయినా నేను ధైర్యం కోల్పోలేదు. సొంతంగా ఒక డాట్ కామ్ వెంచర్‌ను ప్రారంభించాను. దానిపేరే.. షాదీ.కామ్. ఈ డొమైన్‌ను నేను అప్పట్లో రూ.21 లక్షలకు కొన్నాను. ఆ సమయానికి నా అకౌంటులో మరో రూ.25 లక్షలే మిగిలాయి. ఆ టైంలో నా బిజినెస్ ఐడియాను అందరూ తప్పుపట్టారు. అది నడవదని చెప్పారు. నేను అవేవీ పట్టించుకోలేదు. చివరకు సక్సెస్ అయ్యాను’’ అని అనుపమ్ మిట్టల్ పేర్కొన్నారు.
Also Read :Shani Pradosh Vrat: సంతానం కోసం చూసేవారు నేడు ఈ వ్రతం చేయాల్సిందే.. శుభ సమయమిదే..!
‘‘జీవిత ప్రయాణంలో కష్టనష్టాలు రావడం ఖాయం. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. వెనకడుగు వేయకూడదు. భారీ నష్టాల నుంచి లాభాల్లోకి రావాలంటే సహనం కావాలి. మీపై మీకు విశ్వాసం ఉండాలి’’ అని అనుపమ్ మిట్టల్ ఈతరం యువతకు సూచించారు.