Massage Centers: అమ్మాయిలతో మసాజ్ చేయిస్తూ.. పోలీసులకు దొరికిపోయి!

Hyderabad శివారులోని కొన్ని రిసార్ట్స్ అమ్మాయిలతో న్యూడ్ డాన్స్ లు చేయిస్తూ యువతను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే

Published By: HashtagU Telugu Desk
Spa

Spa

హైదరాబాద్ (Hyderabad) సిటీలో రోజురోజుకూ అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా అవుతున్నాయి. ఇప్పటికే శివారులోని కొన్ని రిసార్ట్స్ అమ్మాయిలతో న్యూడ్ డాన్స్ లు చేయిస్తూ యువతను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. వీకెండ్ పార్టీల (Weekend Party) మాటున విచ్చలవిడిగా వ్యభిచారం చేయిస్తూ లక్షల్లో డబ్బులను వసూలు చేస్తున్నాయి. అంతేకాదు.. రిసార్ట్స్, పబ్బుల్లో గంజాయి, డ్రగ్స్ కూడా వాడుతున్నట్టు ఇప్పటికే స్పష్టమైంది. ఈ నేపథ్యంలో కొంతమంది రూటు మార్చి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలతో (Girls) మసాజ్ చేయిస్తూ గంటకు రూ. 1500 దాకా వసూలు చేయిస్తున్నారు.

గంటకు 1500 ఛార్జ్

హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న షాద్ నగర్‌లోని (Shad Nagar) ఫ్రెండ్ ప్రొఫెషనల్ మసాజ్ సెంటర్ (Massage Center) లో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో వారు గత కొద్ది రోజులుగా ఈ మసాజ్ సెంటర్ పై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో పోలీసులు నేడు తమ సిబ్బందిలో ఒకరిని రహస్యంగా ఫ్రెండ్ ప్రొఫెషనల్ మసాజ్ సెంటర్ కి పంపి మసాజ్ చేయాలని కోరగా వారు, అందుకు అంగీకరించారు.

నాలుగైదు రకాల మసాజుల పేర్లు.. గంటకు రూ.1,500 రూపాయలు ఛార్జ్ అన్నారట. దీంతో పోలీసులు (Police) ఆ సెంటర్ పై దాడి చేసి ముగ్గరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం ముందుగానే పసిగట్టిన మసాజ్ సెంటర్‌ నిర్వాహకులు అక్కడినుండి తప్పించుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నిర్వాహకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా (Social Media)లో వైరలవుతున్నాయి. గతంలో హైదరాబాద్ లో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగు చూడటంతో పోలీసులు మరిన్ని దాడులు చేసే అవకాశం ఉంది.

Also Read: Telangana Police: ఎన్నికల వేళ.. మావోయిస్టుల కదలికలపై నిఘా!

  Last Updated: 05 May 2023, 03:17 PM IST