Site icon HashtagU Telugu

Love, Not Lust: ప్రేమ కామం కాదు: బాంబే హైకోర్టు

Love Not Lust

Love Not Lust

Love, Not Lust: 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడని అభియోగాలు మోపిన 26 ఏళ్ల యువకుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది, వారి మధ్య లైంగిక సంబంధం ప్రేమ కామం కాదని కోర్టు పేర్కొంది. నితిన్‌ తాను ప్రేమించుకున్నట్లు ఆ బాలిక పోలీసులకు తెలిపింది. తమ మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు చెప్పింది. తనను పెళ్లి చేసుకుంటానని ప్రియుడు హామీ ఇవ్వడంతో ఇంట్లోని డబ్బు, నగలతో తనకు తానే అతడి వద్దకు వెళ్లినట్లు ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో నిందితుడు నితిన్ బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టు సానుకూలంగా స్పందించింది.

మూడేళ్ల క్రితం అమరావతికి చెందిన యువకుడు మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు కేసు నమోదు చేసి జైలు పాలయ్యాడు అయితే బాధితురాలు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేయలేదని కోర్టు నమ్మింది. 2020లో మహారాష్ట్రకు చెందిన 13 ఏళ్ల బాలిక డబ్బు, నగలతోసహా ఇంటి నుంచి వెళ్లిపోయింది పుస్తకం కొనడానికి సాకుతో బయటకెళ్ళి 26 ఏళ్ల ప్రియుడు నితిన్ ధబేరావ్‌ వద్దకు చేరిందని కోర్టు విశ్వసించింది.

నాగ్‌పూర్ కోర్టు బెంచ్‌లోని జస్టిస్ జోషి-ఫాల్కే మాట్లాడుతూ వారి మధ్య ప్రేమ ఉండటం వల్లే కలిసి ఉండాలనుకున్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టం వల్లే శారీరకంగా కలిశారు. అంతేకానీ నితిన్‌ ఆమెను కామంతో లైంగిక వేధింపులకు గురి చేయలేదు. ఆమెను బలవంతంగా అనుభవించలేదుని జస్టిస్‌ ఊర్మిళ జోషి పార్కే తీర్పులో తెలిపారు

మైనర్ బాలిక తండ్రి చేసిన ఫిర్యాదులో ఆమె ఇంటినుంచి కనిపించకుండా పోయిందని, దీంతో కుమార్తె కోసం గాలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత వారు అంజన్‌గావ్ పోలీసులను ఆశ్రయించగా బెంగళూరులో నిందితుడిని అరెస్ట్ చేశారు.

Also Read: Makar Sankranti: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ భోగి శుభాకాంక్షలు