Tomatoes Offer: ఫొటో దిగు.. టమాటా పట్టుకెళ్లూ.. కొత్తగూడెంలో భలే ఆఫర్!

టమాటా ధరలు పెరగడంతో కొత్తగూడెంలోని ఓ ఫోటోగ్రాఫర్‌కి లాభదాయకంగా మారింది.

  • Written By:
  • Updated On - August 2, 2023 / 06:14 PM IST

టమాటా ధరలు పెరగడంతో కొత్తగూడెంలోని ఓ ఫోటోగ్రాఫర్‌కి లాభదాయకంగా మారింది. బిజినెస్ చేసుకోవడంలో టామాటాలను ఉపయోగించుకుంటున్నాడు స్థానిక ఫోటోగ్రాఫర్, వేముల ఆనంద్. పాస్‌పోర్ట్ ఫోటోల సెట్ కోసం తన స్టూడియోని సందర్శించే కస్టమర్‌లకు తిరుగులేని ఆఫర్‌ చేస్తున్నాడు. కొత్తగూడెం టిఎస్‌ఆర్‌టిసి బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని తన స్టూడియోలో ఎనిమిది పాస్‌పోర్ట్ ఫోటోలు తీసినందుకు టమోటాల ప్యాక్‌ను బహుమతిగా ఇస్తున్నాడు.

వినియోగదారులను ఆకర్షించేందుకు పట్టణంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో ఫ్లెక్స్ బ్యానర్లు ఏర్పాటు చేశాడు. “ఇటీవల జిల్లా కలెక్టరేట్ మరియు కొత్తగూడెంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పలోంచ సమీపంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి (IDOC) మార్చబడ్డాయి. ఫలితంగా చాలా మంది వ్యాపారంతో పాటు నా వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది, ”అని ఆనంద్ చెప్పారు. అందుకే కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు ఇలాంటి ఆఫర్ ను పెట్టినట్టు చెప్తున్నాడు.

తాజాగా టమాటా ధర కోడి మాంసం ధరలను దాటేశాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్లో రికార్డు మోత మోగిస్తూ డబుల్ సెంచరీ కొట్టింది. మంగళవారం రూ.224 ధర పలికింది. అదేవిధంగా అనంతపురం జిల్లా కక్కలపల్లి టమాటా మార్కెట్‌ 15 కిలోల టమాటా బుట్ట రూ.3,200కు అమ్ముడుపోయింది. అంటే కిలో టమాటా సుమారు రూ.215 పలికింది. ఈ మార్కెట్‌ చరిత్రలోనే టమాటా ధర ఇదే అత్యధికమని వ్యాపారులు చెబుతున్నారు.

Also Read: Alanna Panday: బికినీలో సెగలు రేపుతున్న అలన్నా పాండే, ఫొటోలు వైరల్