Three Women : ఎన్నికల క్షేత్రంలో ముగ్గురు శక్తివంతమైన మహిళలు.. ఎవరో తెలుసా ?

Three Women : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌లు ఈ ఎన్నికలు వేదికగా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.

  • Written By:
  • Updated On - April 2, 2024 / 04:14 PM IST

Three Women : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌లు ఈ ఎన్నికలు వేదికగా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈనేపథ్యంలో ముగ్గురు మహిళా నేతల(Three Women)  గురించి ఆసక్తికర వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

సునీతా కేజ్రీవాల్

  • సునీతా కేజ్రీవాల్ 1994 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి. అరవింద్ కేజ్రీవాల్ 1995 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి.
  • మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఆదాయపు పన్ను శాఖాపరమైన శిక్షణా కార్యక్రమంలో తొలిసారి వీరిద్దరూ కలుసుకున్నారు. ఆ వెంటనే 1994 నవంబరులో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
  • తాను ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచే అరవింద్ కేజ్రీవాల్‌కు సునీత అన్నిరకాల సహాయ సహకారాలను అందించారు. అన్నా హజారేతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలోనూ సునీత పాల్గొన్నారు.
  • 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వారణాసి లోక్‌సభ స్థానం నుంచి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారు. ఆ టైంలో తన ఉద్యోగానికి లీవ్ పెట్టి మరీ.. అరవింద్ కేజ్రీవాల్ ప్రచారానికి సునీత సహాయం చేశారు.
  • 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ సీఎం అయ్యారు. ఈ పరిణామం జరిగిన ఏడాది తర్వాత 2016లో సునీత తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
  • 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం గురించి అప్పట్లో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఈ విజయం వెనుక తన భార్య సహకారం కూడా ఉందని వెల్లడించారు.
  • లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన తిహార్ జైలులో ఉన్నారు.
  • ప్రస్తుతం ఢిల్లీ సీఎం రేసులో ఆమె ముందంజలో ఉన్నారు.

Also Read :Kalvakuntla Kanna Rao : కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్

కల్పనా సోరెన్

  • కల్పనా సోరెన్ ఒడిశాలోని మయూర్‌భంజ్‌ వాస్తవ్యులు.
  • ఆమె ఇంజనీరింగ్‌తో పాటు ఎంబీఏలో డిగ్రీని పూర్తి చేశారు.
  • జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒక పాఠశాలను కూడా నడుపుతున్నారు.
  • హేమంత్ సోరెన్‌తో కల్పన పెళ్లి 2006 సంవత్సరంలో జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
  • హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేశాక.. మార్చి 4న జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లో జరిగిన జేఎంఎం 51వ వ్యవస్థాపక దినోత్సవానికి ఆమె హాజరయ్యారు.
  • జార్ఖండ్‌లోని గాండే అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. అక్కడి నుంచి పోటీ చేసేందుకు కల్పన రెడీ అవుతున్నారు. ఒకవేళ గండే అసెంబ్లీ ఉప ఎన్నికలో కల్పనా సోరెన్ గెలిస్తే.. చంపై సోరెన్ స్థానంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా కల్పనా సోరెన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Also Read : Video : వాష్ రూంకు వెళ్లేందుకు.. ‘స్పైడర్ మ్యాన్’ అయ్యాడు !!

సునేత్రా పవార్

  • మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉన్న బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎన్సీపీ(అజిత్ పవార్) తరఫున  అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ పోటీ చేయనున్నారు.
  • ఈ స్థానంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే‌తో సునేత్రా పవార్ తలపడబోతున్నారు.
  • సుప్రియాకు సునేత్ర వదిన అవుతారు. అంటే ఇది వదినా మరదళ్ల కాంపిటీషన్.
  • ఎన్సీపీ గుర్తు, పేరు తమకే ఉన్నందున సునేత్ర గెలిచి తీరుతారనే ధీమాలో అజిత్ పవార్ ఉన్నారు.
  • దశాబ్దాలుగా తమకు కంచుకోటగా ఉన్న బారామతి లోక్‌సభ స్థానం ఎవరి హవా వీయదని సుప్రియా సూలే అంటున్నారు.
  • సునేత్ర, అజిత్‌లకు ఇద్దరు కొడుకులు. సునేత్రకు ఈసారి బీజేపీ, ఏక్‌నాథ్ షిండే శివసేన మద్దతు లభించనుంది.