Maoist Setback : మావోయిస్టు ఉద్యమం భారీ కుదుపులకు గురవుతోంది. అగ్రనేతల ఎన్‌కౌంటర్లతో దానికి సారథ్యం వహించే వారు కరువవుతున్నారు. డ్రోన్లు, నిఘా వర్గాలు, గూఢచారులు, ఇన్ఫార్మర్ల ద్వారా పక్కా సమాచారాన్ని సేకరించి మరీ మావోయిస్టులు కోలుకోలేని విధంగా పోలీసులు, భద్రతా బలగాలు దెబ్బ మీద దెబ్బతీస్తున్నాయి. ప్రత్యేకించి మావోయిస్టులకు ఆయువుపట్టులా ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా అడవులను జల్లెడ పడుతున్నారు. గత రెండేళ్లుగా వరుస ఎన్‌కౌంటర్లతో ఆ దండకారణ్యాలు దద్దరిల్లుతున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే 2026 నాటికి దేశంలో మావోయిజాన్ని అంతం చేస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రతిన నిజమవుతుందా అనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read :Top 10 Non Veg States : నాన్ వెజ్ వినియోగంలో తెలుగు స్టేట్స్ ఎక్కడ ? టాప్- 10 రాష్ట్రాలివే
మావోయిస్టుల ఏరివేత ఇలా జరుగుతోంది..
- ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మావోయిస్టుల యాక్టివిటీ(Maoist Setback) ఎక్కువగా ఉండేది. కాలక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌కౌంటర్లు పెరిగాయి. ఎంతోమంది మావోయిస్టులు చనిపోయారు. దీంతో మావోయిస్టు దళాలు పొరుగున ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అడవుల్లోకి ప్రవేశించాయి.
- ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో క్రమంగా బీజేపీ బలపడింది. బీజేపీ ప్రభుత్వాలు రాజీలేని విధంగా మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లు చేపట్టాయి.
- గత పదేళ్లలో ఆయా రాష్ట్రాల్లో మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ మరింత వేగాన్ని పుంజుకుంది.
- మావోయిస్టులను ఏరివేసేందుకు అవసరమైన బలగాలను, ఆయుధాలను, వాహనాలను, డ్రోన్లను, హెలికాప్టర్లను పెద్దసంఖ్యలో ఆయా రాష్ట్రాలకు కేంద్ర సర్కారు సమకూర్చింది. ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్‌ను కేంద్ర సర్కారు కేటాయించింది.
- దీంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో మావోయిస్టులకు నెలవుగా మారిన అడవులు నెత్తురోడాయి. అక్కడ పెద్దసంఖ్యలో మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేశారు.
- ఈక్రమంలో ఎంతో మంది మావోయిస్టు అగ్రనేతలు చనిపోయారు.
- ఇటీవలే ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి ప్రాణాలు కోల్పోయారు.
- ఆర్‌కే, ఆజాద్ లాంటి మావోయిస్టు అగ్రనేతలు కూడా చనిపోయారు.
- మావోయిస్టు కీలక నేత గణపతి ఏమయ్యారో తెలియడం లేదు.
- హిడ్మా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు.
- పలువురు మావోయిస్టుల కీలక నేతలు వృద్ధాప్యంతో, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
Also Read :Harish Kumar Gupta : ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా.. చంద్రబాబు రాగానే కీలక ప్రకటన
ఆగిపోయిన రిక్రూట్‌మెంట్
మావోయిస్టులు ఒకప్పుడు జోరుగా కొత్తవారిని రిక్రూట్ చేసుకునేవారు. ప్రధానంగా విద్యావంతులు, యువతే మావోయిస్టుల్లో చేరేవారు. ఇప్పుడు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ యువతకు ఆ ఆసక్తి లేదు. ఉద్యోగ అవకాశాలు పెరగడంతో మావోయిస్టుల్లో చేరికలు పూర్తిగా ఆగిపోయాయి.
టెక్నాలజీతో తుద ముట్టిస్తున్నారు
ఒకప్పటి పోలీసులు, భద్రతా దళాలు వేరు. ఇప్పటి పోలీసులు, భద్రతా దళాలు వేరు. ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీని వారు వినియోగిస్తున్నారు. మావోయిస్టుల ఊహకు కూడా అందనంత సాంకేతికత పోలీసులు, భద్రతా బలగాల వద్ద ఉంది. నేరుగా శాటిలైట్లతో ఫొటోలు తీయించగల టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. డ్రోన్లు, ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు, నైట్ విజన్ కెమెరాలు పోలీసులకు లభించాయి. మావోయిస్టులు మాత్రం పాతతరం ఆయుధాలతో బలహీనులయ్యారు. దీంతో ఇదే అదునుగా వరుస ఎన్‌కౌంటర్లు జరిపిన వారిని తుద ముట్టిస్తున్నారు.