Electricity Saving Tips : కొందరికి కరెంటు బిల్లుల మోత మోగుతోంది. భారీగా విద్యుత్ బిల్లులు వస్తుండటంతో లబోదిబోమంటూ గుండెలు బాదుకునే వారు చాలామందే ఉంటారు. అలాంటి వారు హైరానా పడటం ఆపేసి కొన్ని టిప్స్‌ను పాటిస్తే కరెంటు బిల్లులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. అయితేే కరెంటును వేస్ట్ కానివ్వం అని వారు ఒక స్వీయ సంకల్పం తీసుకోవాలి. విద్యుత్‌ను ఆదా చేస్తే మనం పర్యావరణానికి మేలు చేసిన వాళ్లం అవుతాం. ఎందుకంటే కరెంటు తయారీకి బొగ్గును, నీటిని వాడుతుంటారు. ఈ సహజ వనరులను భావితరాల కోసం కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. దీన్ని గుర్తెరిగి మనం నడుచుకోవాలి. కరెంటును పొదుపుగా(Electricity Saving Tips) వాడుకోవాలి.
Also Read :China Halts Foreign Adoptions : విదేశీయులకు పిల్లల దత్తతపై చైనా సంచలన నిర్ణయం
- ఇంట్లో సాధ్యమైనంత మేరకు ఎల్ఈడీ లైట్లనే వాడండి. ఇవి తక్కువ కరెంటుతో పనిచేస్తాయి. ఫలితంగా మీ కరెంటు మీటర్ అంత వేగంగా పరుగెత్తదు. సాధారణ బల్బులతో పోలిస్తే ఎల్ఈడీ లైట్లు ఎక్కువ కాలం పాటు పనిచేస్తాయి.
- మనం కంప్యూటర్, ల్యాప్ టాప్, ట్యాబ్, సెల్ ఫోన్, మిక్సీ, ఇస్త్రీ, వాషింగ్ మెషీన్, వైఫై రూటర్లు, టీవీలు వంటివి వాడితే ప్లగ్‌ను హోల్డర్‌లో పెడుతుంటాం. వాటికి సంబంధించిన పని పూర్తయ్యాక హోల్డర్ నుంచి అన్ ప్లగ్ చేయకుండా వదిలేస్తుంటాం. ఈ విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ను ఉపయోగించిన తర్వాత చాలామంది వాటిని అన్‌ప్లగ్ చేయకుండా అలానే ఉంచేస్తారు. దీనివల్ల వాటిలోకి విద్యుత్ సరఫరా కొనసాగుతుంది. వాటిని అన్ ప్లగ్ చేస్తే.. ఆ సెక్షన్‌లో విద్యుత్ సప్లై ఆగిపోతుంది. ఫలితంగా కరెంటు బిల్లు తగ్గిపోతుంది.
- చాలామంది ఇళ్లలో హీటర్లు, వెంటిలేటర్లు, ఏసీలు వాడుతుంటారు. అయితే వాటిని సరిగ్గా మెయింటైన్ చేయరు. ఉదాహరణకు ఏసీలో ఎయిర్ ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా మార్చాలి. ఏడాదికోసారైన ఏసీకి మెకానిక్‌తో సర్వీస్ చేయించాలి. ఒకవేళ దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయకుంటే కరెంటును భారీగా వినియోగిస్తుంది. సర్వీసు సకాలంలో చేయిస్తే బిల్లు తగ్గుతుంది. దాని లైఫ్ టైం కూడా పెరుగుతుంది. ఏసీని ఎప్పుడుపడితే అప్పుడు వాడకుండా అవసరమైనప్పుడే వాడితే బెటర్.
Also Read :Kamala Harris Husband Comments : కమలను డిబేట్‌లో ఓడించడం అసాధ్యం.. భర్త డగ్లస్ కామెంట్స్
- సాధ్యమైనంత మేరకు ఇంట్లో స్టార్ రేటింగ్స్ కలిగిన టీవీ, ఫ్రిడ్జ్, ఏసీల వంటి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్లు వాడాలి. ఇవి తక్కువ కరెంటుతో పనిచేస్తాయి.
- ఉదయం టైంలో లైట్స్, ఫ్యాన్స్ వినియోగం తగ్గించండి.
- ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు, టీవీలను ఆఫ్ చేయండి.
- టీవీ, కంప్యూటర్లను స్టాండ్‌బై మోడ్‌లో ఉంచొద్దు. వినియోగం పూర్తయిన వెంటనే స్విచ్ఛాఫ్ చేయాలి.
- వాషింగ్ మెషీన్ల వినియోగం తగ్గించండి.