Iran Vs Israel : మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై ఇరాన్ భీకర దాడి చేసింది. దాదాపు 200కుపైగా బాలిస్టిక్ మిస్సైళ్లను ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. కానీ ఒకప్పుడు ఈ రెండు దేశాలు చాలా ఫ్రెండ్లీగా ఉండేవి. ఆ వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
Also Read :Railway Tracks : రైల్వే ట్రాక్‌ను పేల్చేసిన దుండగులు
1960 నుంచి 1990 వరకు ఏమైందంటే.. ?
- 1960వ దశకంలో ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలకు ఒక ఉమ్మడి శత్రువు ఉండేది. అదే ఇరాక్.
- అరబ్ ప్రాంతంలో చాలా వరకు సున్నీ ఇస్లామిక్ దేశాలే(Iran Vs Israel) ఉన్నాయి. కానీ ఇరాన్ షియా ఇస్లామిక్ దేశం.
- సున్నీ దేశాలు ఆనాడు ఇజ్రాయెల్‌కు దూరంగా ఉండేవి. అందుకే ఇరాన్‌కు ఇజ్రాయెల్ చేరువైంది.
- ఇరాన్‌కు చెందిన సీక్రెట్ పోలీస్ యూనిట్ సావక్ (సావక్), ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మోసాద్ కలిసి ఇరాక్‌లోని కుర్దు వేర్పాటువాదులను అప్పట్లో బలోపేతం చేశాయి.
- అప్పట్లో ఇరాన్-ఇజ్రాయెల్‌తో తుర్కియే కూడా చాలా సన్నిహితంగా ఉండేది.
- ఆనాడు ఇరాన్, ఇజ్రాయెల్, టర్కీ కలిసి ట్రైడెంట్ అనే కోడ్‌నేమ్‌తో ఒక గ్రూపును ఏర్పాటుచేశాయి. వీటి గూఢచార సంస్థలు అప్పట్లో కీలకమైన సైనిక సమాచారాలను ఇచ్చి పుచ్చుకునేవి.
- 1960వ దశకంలో ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం ఏర్పాటైంది.
- 1970వ దశకం చివర్లో ఇరాన్ కోసం ఉపరితలంపై నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే అణుక్షిపణులు సిద్ధం చేసే ప్రాజెక్టును ఇజ్రాయెల్ చేపట్టింది. ఇందుకోసం అడ్వాన్స్‌గా అప్పటి ఇరాన్ షా ప్రభుత్వం భారీగా చమురును ఇజ్రాయెల్‌కు సప్లై చేసింది. ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం వచ్చే వరకు ఈ ప్రాజెక్టు కొనసాగింది.
- 1980-88 మధ్య జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధం సమయం వరకు కూడా ఇరాన్, ఇజ్రాయెల్ కలిసే ఉండేవి.
- ఇరాన్ వద్ద 1980వ దశకం నాటికే అమెరికా తయారీ ఎఫ్-4 ఫాంటమ్ ఫైటర్ జెట్లు ఉండేవి. ఇస్లామిక్ విప్లవం వచ్చిన తర్వాత ఇరాన్‌కు యుద్ధ విమానాల స్పేర్ పార్టులు ఇవ్వడాన్ని అమెరికా ఆపేసింది. దీంతో అప్పట్లో ఇజ్రాయెల్ వీటిని రహస్యంగా ఫ్రాన్స్‌కు, అక్కడినుంచి ఇరాన్‌కు పంపేది.
- అమెరికాకు చెందిన 51 మంది దౌత్యవేత్తలు ఇరాన్‌లో బందీలుగా ఉన్నా ఇజ్రాయెల్ యుద్ధ విమానాల టైర్లను అప్పట్లో ఇరాన్‌కు పంపింది. ఇరాక్ విజయాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్ ఆనాడు అలా వ్యవహరించింది.
- 1990వ దశకం నుంచి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య సహకారం తగ్గిపోయింది. వీటి స్నేహం కాస్త శత్రుత్వంగా మారిపోయింది.