International Dogs Day: ప్రతి కుక్కకు ఓ రోజు.. ఇదే ఆరోజు..!

మొట్ట మొదటిసారిగా అంతర్జాతీయ కుక్కల దినోత్సవాన్ని (International Dogs Day) ఆగస్టు 26, 2004 న నిర్వహించారు.

  • Written By:
  • Updated On - August 26, 2023 / 11:51 AM IST

International Dogs Day : ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 26ని అంతర్జాతీయ కుక్కల దినోత్సవం గా జరుపుకుంటారు. ఈ వేడుకల ఉద్దేశ్యం కుక్కలను దత్తత తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించడం, వాటికి మెరుగైన జీవితాన్ని అందించడం. మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ కుక్కల దినోత్సవాన్ని (International Dogs Day) ఆగస్టు 26, 2004 న నిర్వహించారు. అమెరికా జంతు న్యాయవాది, పెంపుడు, కుటుంబ జీవనశైలి నిపుణుడు కోలిన్ పైజ్ ఈ రోజును జరుపుకోవడం ప్రారంభించారు.

మనుషులతో కుక్కల సంబంధం చాలా బలమైనది. శునకాలకు గ్రామ సింహం అనే మరో పేరు ఉంది. ఇవి గ్రామంలో ఉంటే దొంగలకు భయం. కుక్కలు ఎక్కువగా అరుస్తున్నాయంటే దొంగలు వచ్చినట్లుగా అనుమానించాల్సిందే. లేక ఇంకేవరైనా అనుమానిత వ్యక్తులు వచ్చినట్లు భావిస్తుంటారు. శునకాల వల్ల పోలీసు శాఖకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీటి ద్వారా ఎన్నో హత్య కేసులు, ఇతర కేసులను చేధించారు. ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి.

International Dogs Day ఎలా జరుపుకుంటారు..?

ఇంటర్నేషనల్ డాగ్ డే సందర్భంగా మీ కుక్కతో ఒక మంచి ప్రదేశానికి వెళ్లాలి. మీ కుక్క సంక్షేమ సంస్థల కోసం వారు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. దిక్కులేని కుక్కలకు సహాయం చేసే సంస్థలకు విరాళాలు ఇవ్వటం.. అటువంటి కుక్కలకు ఆహారం అందించటం వంటివి చేయొచ్చు.

చురుకుగా ఉండటం..

మీకు ఇంట్లో కుక్క ఉంటే దాని సహాయంతో మీరు ఫిట్‌గా, చురుకుగా ఉండగలరు. మీరు దానితో ఆడుకోవడం, వాకింగ్ చేయడం వంటి సాకుతో శారీరకంగా కూడా చురుకుగా ఉంటారు. కుక్కలు మిమ్మల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచుతాయి.

ఒత్తిడి నుండి ఉపశమనం..

మీరు ఒత్తిడిలో ఉంటే.. ఏదైనా విషయంలో చాలా కలత చెందితే, మీ కుక్కలతో కొంత సమయం గడపండి. వాటితో మాట్లాడండి. మీ మాటలకు కుక్కలు ప్రతిస్పందించనప్పటికీ వాటి చర్యలు, ప్రేమగల స్వభావం ఖచ్చితంగా మీ ఒత్తిడిని దూరం చేస్తాయి.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది..

మీ ఇంట్లో కుక్క ఉంటే అది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. వాటి సాకుతో మీరు ఉదయం, సాయంత్రం నడవవచ్చు. వాటితో తేలికగా ఆడటం ద్వారా మీరు చాలా కేలరీలను బర్న్ చేయవచ్చు. ప్రస్తుతం కుక్కలతో యోగా చేసే ట్రెండ్ కూడా బాగా పాపులర్ అవుతోంది. నిజానికి యోగా అనేది రిలాక్సింగ్ వ్యాయామం. ప్రజలు కుక్కలతో యోగా చేయడం ఆనందిస్తున్నారు.ఇలా చేయడం ద్వారా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రయోజనం పొందుతున్నారు.

ఒంటరితనం పోతుంది..

ఒంటరిగా జీవించే వ్యక్తులకు ఇంతకంటే మంచి స్నేహితుడు ఉండడు. కొన్నిసార్లు ఈ ఒంటరితనం ఒత్తిడి, నిరాశకు కూడా కారణం కావచ్చు. కాబట్టి మీరు ఒంటరిగా జీవిస్తూ ఈ పరిస్థితిని ఎదుర్కోకూడదనుకుంటే కుక్కలను పెంచే ఆలోచన ఉత్తమం.

 

Also Read: Vitamin C Deficiency: విటమిన్‌ సి లోపం ఉంటే.. ఈ అనారోగ్యాలు వస్తాయ్‌..!