Alphonso Mango: దేశంలో కిలోల లెక్కన కాకుండా డజను లెక్కన లభించే ఏకైక మామిడి అల్ఫోన్సో. విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన మామిడి (Alphonso Mango) ఇది. దీని చరిత్ర 500 సంవత్సరాలకు పైగా ఉంది. దీనిని హపస్ లేదా హఫూస్ అని కూడా అంటారు. దీనికి అల్ఫోన్సో లేదా హఫూస్ అనే పేరు ఎలా వచ్చిందనే దాని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.
ముందుగా ఈ మామిడికాయ ప్రత్యేకత ఏంటంటే..?
మామిడి పండిన వారం రోజుల వరకు పాడవకుండా ఉండడం ఈ మామిడి అతిపెద్ద ప్రత్యేకత. ఈ కారణంగానే హఫూస్‌ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ నాణ్యత కారణంగా ఇది సాధారణ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా అందుబాటులో ఉంది. దేశంలోని ప్రతి ప్రాంతానికి సరఫరా అవుతుంది. ఈ మామిడిపండు డజన్ల లెక్కన అమ్ముడవుతోంది. డజను మామిడి పండ్ల ధర రూ.1200 నుంచి రూ.2000 వరకు ఉంటుంది. ఈ మామిడి పండు మహారాష్ట్రలో ఎక్కువగా పండుతాయి. ఇవిఎక్కువగా రత్నగిరి, సింధుదుర్గ్, వాటి పరిసర ప్రాంతాలలో ఉత్పత్తి అవుతుంది.
Also Read: Nabha Natesh : కారులో దేవర పాట పెట్టుకొని.. డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తున్న నభా..
దీనికి అల్ఫోన్సో అనే పేరు ఎలా వచ్చింది?
దీని పేరు వెనుక కూడా ఒక అద్భుతమైన కథ ఉంది. అల్ఫోన్సో అనేది ఆంగ్ల పేరు. అది దాదాపు 1510-1515 సంవత్సరం. ఆ సమయంలో గోవాను పోర్చుగల్ నుండి వచ్చిన వారు పాలించారు. పాలించిన వ్యక్తి పేరు అల్ఫోన్సో డి అల్బుకెర్కీ. అల్ఫోన్సోకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. మలేషియా నుంచి ప్రత్యేకంగా మామిడి మొక్కను తీసుకొచ్చి గోవాలో నాటాడు. కాలక్రమేణా దాని మొక్కలు చాలా మలేషియా నుండి దిగుమతి చేసుకున్నారు. దీంతో స్థానిక మామిడి తోటలలో ఈ మొక్కలను నాటారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ మామిడిపండ్లు చాలా తియ్యగా, రుచిగా ఉండేవి. రుచి కారణంగా ఈ మామిడిని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడటం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత అల్ఫోన్సో డి అల్బుకెర్కీ మరణించాడు. అతను మలేషియా నుండి ఈ మామిడి మొక్కను తీసుకువచ్చాడు. దాంతో అల్ఫోన్సోకు నివాళులర్పించడానికి అతని పేరు మీద అల్ఫోన్సో అని పేరు పెట్టారు.