Site icon HashtagU Telugu

Indira Gandhi: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఇందిరాగాంధీ స్మారక తులిప్‌ గార్డెన్‌

Tulip

Tulip

జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న ఇందిరాగాంధీ స్మారక తులిప్‌ గార్డెన్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.  68 రకాలకు చెందిన 1.5 మిలియన్ల తులిప్‌ పుష్పాలతో ఆసియాలో అతిపెద్ద గార్డెన్‌గా ఈ ఘనత సాధించింది. ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో ఫ్లోరికల్చర్‌, గార్డెన్స్‌ అండ్‌ పార్క్స్‌ కమిషనర్‌ సెక్రటరీ షేక్‌ ఫయాజ్‌ అహ్మద్‌కు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అధ్యక్షుడు సంతోష్‌ శుక్లా.. గుర్తింపు పత్రాన్ని అందించారు.  30 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న శ్రీనగర్‌లోని తులిప్‌ గార్డెన్‌ ఉంది.

జమ్మూకాశ్మీర్ పేరువిన‌గానే అంద‌మైన ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు గుర్తుకొస్తాయి. ప‌చ్చ‌ద‌నాన్ని క‌మ్మేసిన మంచు పొర‌లు క‌ల్ల‌ముందు మెద‌లాడుతాయి. అలాంటి జ‌మ్మూకాశ్మీర్ ఇప్పుడు రంగురంగుల పువ్వులతో సంద‌ర్శ‌కుల‌ను ఆకట్టుకుంటోంది. ఎటు చూసినా చూపు తిప్పుకోనీయ‌ని ఎరుపు, తెలుపు రంగుల్లో తులిప్ పుష్పాలు సందర్శకులను ఆకర్శిస్తున్నాయి. తులిప్‌ పూలతోపాటే చాలా రకాల ఇతర పుష్పాలు కూడా తులిప్‌ గార్డెన్‌కు వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

ఇప్ప‌టికే ఈ అందాల‌ను చూసేందుకు సుదూర  ప్రాంతాల నుంచి ప్ర‌కృతి ప్రేమికులు బారులు తీరుతున్నారు. నిజానికి, ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్‌ పూల గార్డెన్‌లు ఉన్నాయి. అయితే శ్రీనగర్‌లోని తులిప్‌ గార్డెన్‌ మాత్రం ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఈ గార్డెన్‌ విస్తీర్ణం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 30 హెక్టార్‌లు ఉంది. ప్రతి ఏటా వసంత రుతువులో పుష్పాలు వికసిస్తుంటే ఈ గార్డెన్‌ను తెరుస్తారు. అలా ప్రతి ఏడాది తులిప్ ఫెస్టివల్‌ పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

Also Read: Andhra Villages: దాహమో రామచంద్రా.. ఏపీలో 850 గ్రామాల్లో నీటికి కటకట

Exit mobile version