భారతదేశంలో అనేక రకాల రైళ్లు చూసాం. దూరం వెళ్లే రైళ్ల గురించి ఎక్కువగా వింటుంటాం. కానీ అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు గురించి పెద్దగా మనం మాట్లాడుకోము. ఇప్పుడు ఆ రైలు గురించి మీకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. కేరళలోని కొచ్చి నగరంలో నడిచే “DEMU train” మన దేశంలోనే అతి చిన్న ప్రయాణికుల రైలు. ఇది కేవలం 9 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణిస్తుంది. విల్లింగ్ టన్ ఐలాండ్ నుండి ఎర్నాకులం వరకు నడిచే ఈ ట్రైన్ రోజుకు రెండు సార్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మొత్తం మూడు కోచ్‌లు మాత్రమే కలిగి ఉన్న ఈ రైలు, 40 నిమిషాల వ్యవధిలో తన ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది.
Rajamouli Love Track : యాంకర్ రష్మీ తో రాజమౌళి లవ్ ట్రాక్
ఈ చిన్న రైలులో 300 మంది ప్రయాణికుల సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంది. అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం ఒకే ఒక్క స్టాఫ్‌తో ఇది నడుస్తోంది. తక్కువ దూరం ప్రయాణించే ఈ ట్రైన్, కొచ్చి నౌకాశ్రయాన్ని సదరన్ నావల్ కమాండ్‌తో అనుసంధానం చేస్తుంది. ఆకర్షణీయమైన గ్రీన్ కలర్‌లో దర్శనమిచ్చే ఈ రైలు, ప్రయాణికులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తోంది. నగరంలో వున్నా, ప్రశాంతంగా ప్రయాణించే అనుభవాన్ని ఇస్తుంది. తక్కువ ప్రయాణ సమయంలోనే సుందరమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించే అవకాశం అందిస్తోంది. కొచ్చి నగర ప్రజలకు ఇది ఒక ముఖ్యమైన కనెక్షన్‌గా మారింది. చిన్నదైనప్పటికీ, ప్రయాణికులకు ఇది ప్రయోజనం కలిగించేలా ఉంది. మరి రాబోయే రోజుల్లోనూ ఇలాగే ఈ ట్రైన్ ను కొనసాగిస్తారా…? లేక రద్దు చేస్తారా అనేది చూడాలి.