Pokhran – Top 10 : అణు పరీక్షల గడ్డ ‘పోఖ్రాన్‌’.. విశేషాలు ఇవిగో

Pokhran - Top 10 : పోఖ్రాన్‌.. ఈ పేరు ప్రపంచమంతటికీ సుపరిచితం.

  • Written By:
  • Updated On - March 16, 2024 / 12:46 PM IST

Pokhran – Top 10 : పోఖ్రాన్‌.. ఈ పేరు ప్రపంచమంతటికీ సుపరిచితం. రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిలో ఉండే అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఇది ఒకటి. భౌగోళికంగా ఇక్కడున్న ప్రతికూల పరిస్థితులే పోఖ్రాన్‌ను అణు పరీక్షల కేంద్రంగా మార్చాయి. 24 ఏళ్ల వ్యవధిలో ఇక్కడ రెండుసార్లు అణు పరీక్షలను నిర్వహించారు. జైసల్మీర్ నుంచి పోఖ్రాన్‌కు వెళ్లే దారిలో ఉన్న ఖేతోలియా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలోనే 1974 మే 18, 1998 మే 11, 13 తేదీల్లో భూగర్భ అణు పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రాంతమంతా పూర్తిగా ఆర్మీ ఆధీనంలో ఉంటుంది. అణు పరీక్షలు జరిగిన దాదాపు 10 చ.కి.మీ. ప్రాంతానికి ప్రత్యేకంగా కంచె వేశారు. సైనికులు 24 గంటలపాటు పహారా కాస్తుంటారు. ఇటీవల భారత ఆర్మీ నిర్వహించిన ‘భారత్ శక్తి’ విన్యాసాలతో మరోసారి పోఖ్రాన్ పేరు తెరపైకి వచ్చింది. దానిపై చర్చ మొదలైంది. ఈనేపథ్యంలో పోఖ్రాన్‌తో ముడిపడిన కొన్ని ఆసక్తికర విశేషాలను(Pokhran – Top 10) తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

  • పోఖ్రాన్‌‌ను మొదట్లో పోకర్ణ అని పిలిచేవారు. అధిక సాంద్రత కలిగిన ఉప్పు పర్వతాల మధ్యలో ఉన్నందున దీనికి పోకర్ణ అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ఆ పేరే  పోఖ్రాన్‌గా మారిపోయింది.
  • పోఖ్రాన్ పట్టణం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు 112 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  • 100 చదరపు కి.మీ. మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో నిత్యం కరవు ఉంటుంది. వందల మీటర్ల లోతు తవ్వినా ఇక్కడి నేలలో చుక్కనీరు పడదు.

Also Read : Change In Constitution : రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన లేదు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

  • పాకిస్థాన్‌ సరిహద్దులకు సమీపంలో ఉండే ఈ ప్రాంతం రక్షణపరంగా కూడా వ్యూహాత్మకమైంది. అందుకే దీన్ని సైనికభాషలో ఆల్ఫా, బీటా, బ్రేవో, ఛార్లీ అనే నాలుగు సెక్టార్లుగా విభజించారు.
  • పోఖ్రాన్‌లోని ఒక్కో సెక్టార్‌లో ఒక్కోటి చొప్పున పదాతిదళాలు, ఆర్టిలరీ, యాంత్రిక విభాగం (మెకనైజ్డ్‌ యూనిట్‌), వాయుసేన విభాగాలు ఉంటాయి.
  • వేసవిలో పోఖ్రాన్‌లో 50 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.
  • హర్‌ ఘర్‌ జల్‌ యోజన కింద ఈ ప్రాంతానికి కొంతవరకూ తాగునీరు అందిస్తున్నారు. ఇందుకోసం వందల కిలోమీటర్ల మేర పైపులైన్లు నిర్మించారు.