Indian Railways : ఈరోజు (ఏప్రిల్ 16)తో మన భారతీయ రైల్వేకు 172 ఏళ్లు. 1853 సంవత్సరం ఏప్రిల్ 16న మన దేశంలో రైల్వే వ్యవస్థ ప్రస్థానం మొదలైంది. ఆనాటి బ్రిటీష్ పాలకులు తమ వ్యాపార ప్రయోజనాల కోసం రైల్వే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారతదేశంలోని ఖనిజ వనరులు, మసాలా దినుసులు, విలువైన సంపదను ఓడరేవుల వరకు చేరవేసేందుకు రైల్వే లైన్లను వేశారు.
Also Read :Waqf Act : ఆలయ బోర్డుల్లో ముస్లింలకు చోటిస్తారా ? ‘వక్ఫ్’పై కేంద్రానికి సుప్రీం ప్రశ్న
తొలి రైలు జర్నీ ఇలా..
భారతదేశంలో తొలి రైలు(Indian Railways) 1853 సంవత్సరం ఏప్రిల్ 16న మధ్యాహ్నం 3:35 గంటలకు ముంబైలోని బోరీ బందర్ నుంచి 14 బోగీలతో ఠాణే వైపుగా ప్రయాణించింది. ఆ రైలుకు ఆనాడు బ్రిటీష్ పాలకులు 21 తుపాకీ గుంజులతో సెల్యూట్ సమర్పించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆ తొలి రైలు సర్వీసులో 400 మంది ఆహ్వానిత అతిథులు ప్రయాణించారు. ఆ ట్రైన్‌ను ‘సింద్’, ‘సుల్తాన్’, ‘సాహెబ్’ అనే పేర్లున్న మూడు ఇంజిన్లు కలిసి లాగాయి. 34 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 15 నిమిషాల్లో ఈ రైలు చేరుకుంది.
Also Read :Robert Vadra : పాలిటిక్స్‌లోకి రాబర్ట్ వాద్రా.. గ్రౌండ్ రెడీ ?
భారత రైల్వే అంచెలంచెలుగా అప్‌డేట్
- రైల్వే శాఖ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్యాసింజర్ నుంచి ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫ్టాస్, సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది.
- సాంకేతిక విప్లవం వల్ల రైల్వే వ్యవస్థలో పెను మార్పులు వచ్చాయి.
- తొలుత స్టీమ్‌లోకోమోటివ్ ఇంజిన్లు ఉండేవి. తదుపరిగా డీజిల్‌లోకోమోటివ్ ఇంజిన్లు వచ్చాయి. ఆ తర్వాత డబ్ల్యూడీఎం–2, 3, 4, 6 (కంప్యూటరైజ్‌డ్‌లోకోమోటివ్), ఎలక్ట్రిక్‌లోమోటివ్, ఎలక్ట్రిక్‌లోకోమోటివ్ ఇంజిన్లు వచ్చాయి.
- ఆపై అమెరికా టెక్నాలజీతో డబ్ల్యూఎపీ–2, 4, 7, డబ్ల్యూఎజీ– 5, డబ్ల్యూఎపీ–12 లోకోమోటివ్ ఇంజిన్లను తీసుకొచ్చారు.
- వందేభారత్ రైలు 130 కేఎంపీహెచ్ స్పీడ్‌తో పట్టాలపై పరుగులు పెడుతోంది.
- వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఇది భారతదేశపు మొట్టమొదటి సెమీ హై స్పీడ్ స్వదేశీ రైలు.
- తేజస్ ఎక్స్‌ప్రెస్ , దురంతో , గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌లు.. ఆధునిక సౌకర్యాలతో తయారయ్యాయి.
- మెట్రో నెట్‌వర్క్‌లు.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి.
- 2025 నాటికి భారతీయ రైల్వేలు ఆసియాలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా ఎదిగాయి.
- భారత రైల్వే నెట్‌వర్క్ పొడవు: 68,000 కి.మీ కంటే ఎక్కువే. ఇందులోని ఉద్యోగులు 12 లక్షల మందికిపైనే.
- రోజువారీ ప్రయాణికులు 2.3 కోట్లకు పైనే.
- రోజూ మన దేశంలో నడిచే రైళ్లు 13వేలకుపైనే.