Site icon HashtagU Telugu

India Border : ఇక మన బార్డర్‌‌కు సూడో శాటిలైట్ల రక్షణ.. ఏమిటివి ?

India Border

India Border

India Border : ఇజ్రాయెల్‌పై  హమాస్ ఆకస్మిక ఉగ్రదాడుల నేపథ్యంలో సరిహద్దు భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం  చేయడంపై భారత్ ఫోకస్ చేస్తోంది. ఈక్రమంలోనే బార్డర్‌లో డ్రోన్లతో నిఘాను ముమ్మరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గతవారమే ఆరు స్వదేశీ డ్రోన్ తయారీ కంపెనీల ప్రతినిధులతో భారత రక్షణ శాఖ అధికారులు భేటీ అయ్యారు.  ఆర్మీ కోసం డ్రోన్లను సప్లై చేయాలని వారికి వచ్చే నెలలో ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మే నాటికి భారత బార్డర్‌లోని అన్ని సున్నితమైన ప్రాంతాల్లో డ్రోన్లను మోహరించాలనే లక్ష్యంతో భారత ఆర్మీ ఉంది. ముఖ్యంగా హిమాలయాల వెంబడి ఉన్న చైనా బార్డర్‌లో, పాక్ ఉగ్రవాదుల చొరబాట్లు గతంలో జరిగిన ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘాను ముమ్మరం చేయనున్నారు.

ఈ డ్రోన్లు ఎలా పనిచేస్తాయంటే.. 

బార్డర్‌లో డ్రోన్ల మోహరింపు పూర్తికావడానికి దాదాపు 18 నెలల టైం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ డ్రోన్ల నిర్వహణకు సంవత్సరానికి దాదాపు రూ.4100 కోట్ల వరకు ఖర్చవుతుందని అంటున్నారు. అయితే బార్డర్‌లో భారత్ వాడబోయే డ్రోన్లు మామూలువి కాదని.. అవన్నీ  హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్లు అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇవి ల్యాండింగ్ చేయాల్సిన అవసరం లేకుండా సుదీర్ఘకాలం గగనతలంలోనే ఉంటూ డ్యూటీ చేస్తాయని అంటున్నాయి. ఇప్పటికే మనకు బార్డర్‌లో ఉన్న రాడార్ నెట్‌వర్క్‌కు బ్యాకప్‌గా ఈ డ్రోన్లు పనిచేస్తాయని ఆర్మీ వర్గాలు వివరిస్తున్నాయి. ఈ డ్రోన్ల నుంచి నేరుగా ఆర్మీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌లో విజువల్స్ లైవ్ టెలికాస్ట్(India Border)   అవుతుంటాయి.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో భారత్‌పై ఆకస్మిక దాడులు

  • 2008లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఆయుధాలు, గ్రెనేడ్‌లతో సముద్రం ద్వారా ముంబయిలోకి చొరబడ్డారు. మూడు రోజుల పాటు నగరంలోని కీలక ప్రదేశాలను సీజ్ చేసి 166 మందిని చంపారు.
  • గుజరాత్, రాజస్థాన్ పరిధిలోని భారత పశ్చిమ సరిహద్దు మీదుగా తరుచుగా డ్రగ్స్‌ సప్లై జరుగుతోంది. చాలాసార్లు డగ్స్ ముఠాలను భారత సైన్యం పట్టుకుంటోంది. వీటి కదలికలను ఇంకా క్లియర్‌గా ట్రాక్ చేసేందుకు డ్రోన్ నిఘాతో బాటలు పడతాయి.

Also Read: Simhachalam: సింహాచలం ఆలయంలోకి కుక్క ప్రవేశం, 2 గంటల పాటు మూసివేత