UPI -Wrong Number : రాంగ్​ నంబర్​కు యూపీఐ పేమెంట్ చేస్తే.. నెక్ట్స్ ఏంటి ?

UPI -Wrong Number : యూపీఐ పేమెంట్స్ ఇప్పుడు మనదేశంలో ఒక రేంజ్‌లో జరుగుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
UPI Transaction Fees

UPI -Wrong Number : యూపీఐ పేమెంట్స్ ఇప్పుడు మనదేశంలో ఒక రేంజ్‌లో జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఫోన్ చేతిలో పట్టుకొని.. యూపీఐ పేమెంట్ చేయడానికి అలవాటుపడి పోయారు.రోజూ కొన్ని కోట్ల విలువైన యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరగడం, స్మార్ట్ ఫోన్ల లభ్యత పెరగడం వంటి కారణాలతో యూపీఐ లావాదేవీలు ఒక్కసారిగా జూమ్ అయ్యాయి. మనదేశ ప్రభుత్వం కూడా డిజిటల్ లావాదేవీలను ఎంకరేజ్ చేస్తోంది. దీంతో వాటికి ఒక హద్దు అనేది లేకుండాపోతోంది. మొబైల్​ ఫోన్​ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసే క్రమంలో మనం పొరపాటున ఒకరి ఫోన్ నంబరుకు బదులు మరొకరి ఫోన్ నంబరును ఎంటర్ చేస్తే.. ఎలా ? ఒకరికి పంపాల్సిన డబ్బులు ఇంకొకరికి చేరితే.. ఎలా ? ఏం చేయాలి ? ఆ డబ్బుల సంగతి అంతేనా ? అనే డౌట్స్ చాలామందికి వస్తుంటాయి. ఇప్పుడు వాటిపై వివరాలు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join.

ఇవీ పరిష్కార మార్గాలు.. 

  • యూపీఐ పేమెంట్స్ చేసే క్రమంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే.. తొలుత మనం సంబంధిత బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వాలి.
  • ఒకవేళ మీరు బ్యాంకుకు సమాచారం ఇచ్చే సమయానికి.. మీరు పంపిన డబ్బులను అవతలి వ్యక్తి (రాంగ్ నంబర్) రిసీవ్  చేసుకొని ఉంటే డబ్బులు రీఫండ్ కావడం కొంత క్లిష్టతరంగా మారుతుంది.
  • ఇలాంటి సమయంలో మనం యూపీఐ పేమెంట్ యాప్‌ వద్ద కూడా ఒక కంప్లయింట్‌ను రిజిస్టర్ చేయించాలి. వారు కూడా బ్యాంకు ద్వారా ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తారు.
  • అన్ని యూపీఐ లావాదేవీలను రీఫండ్ చేయడానికి వీలు ఉండదని మనం గుర్తుంచుకోవాలి.
  •  బ్యాంకు,యూపీఐ యాప్‌ల నుంచి కూడా సమస్యకు పరిష్కారం దొరకకుంటే.. మనం నేరుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ)ను కాంటాక్ట్ చేయాలి.
  • ఎన్​పీసీఐ అనే సంస్థ యూపీఐ సిస్టమ్​ను కంట్రోల్​ చేస్తుంది. దాని ద్వారా.. మీకు రీఫండ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందుకోసం మీరు రాంగ్​ ట్రాన్సాక్షన్ వివరాలను ఎన్పీసీఐ అధికారులకు సమర్పించాలి.
  • మీ పరిధిలో ఉన్న బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ లేదా సంబంధిత రెగులేట్​ అథారిటీ ఆధికారుల ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్‌కు పరిష్కారాన్ని పొందొచ్చు. మీరు కంప్లయింట్  చేసిన కొన్ని రోజుల తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మీ డబ్బు మీ అకౌంట్‌లో తిరిగి జమ అవుతుంది.

Also Read: Telangana Polls : 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్

  Last Updated: 30 Oct 2023, 02:47 PM IST