Site icon HashtagU Telugu

C-Vigil App : ‘సీ-విజిల్’ యాప్.. ఎన్నికల అక్రమాలపై మీరూ కంప్లయింట్ చేయొచ్చు

C Vigil App

C Vigil App

C-Vigil App : ఎన్నికల వేళ జరిగే అవకతవకలు, అక్రమాలను సామాన్య పౌరులు కూడా బయటపెట్టొచ్చు. వాటిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఎక్కడైనా అధికార దుర్వినియోగం కానీ, డబ్బుల పంపిణీ కానీ జరిగినా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఎలా ? అని అనుకుంటున్నారా !! మరేం లేదు.. కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ‘సీ విజిల్‌’ (C-vigil) యాప్‌‌  ద్వారా ఇలాంటి అంశాలపై అధికారులకు ఫిర్యాదులను పంపొచ్చు. అక్రమాలను వెలుగులోకి తేవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘సీ విజిల్‌’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఫోన్‌ నెంబర్ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలి.

We’re now on WhatsApp. Click to Join

ఫొటో, వీడియో, ఆడియో..ఏదైనా ఒకటి చాలు

Also Read :Sita Soren : బీజేపీలోకి హేమంత్‌ సోరెన్‌ వదిన.. ఎందుకో తెలుసా ?

ఎన్నికల్లో డబ్బులు ఖర్చుపెట్టి గద్దెనెక్కుదామనుకునే రాజకీయ నాయకులకు  సీ-విజిల్ యాప్ చెక్‌పెట్టనుంది. మంచి ప్రజానాయకుడిని ఎన్నుకోవడం ఎంత అవసరమో..  అక్రమార్కులకు ఆదిలోనే అడ్డుకట్ట వేయడం అంతే అవసరం. కేవలం డబ్బుతోనే విజయం సాధించవచ్చనుకునే వాళ్లను ఈ యాప్‌ భరతం పట్టనుంది. ప్రజలంతా ఈ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుని ఎన్నికల అక్రమాలపై తక్షణం ఫిర్యాదు చేయాల్సిందిగా  ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది.

Also Read :Errabelli Dayakar Rao: నేను కేసీఆర్ సైనికుడిని, పార్టీ మారే ముచ్చటే లేదు